Telugu Global
Telangana

సిద్ధిపేటలో చెట్టు-బొట్టు

జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్‌ బ్యాక్‌ లో సిద్దిపేట రెండో స్థానంలో ఉందని చెప్పారు మంత్రి హరీష్ రావు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మొక్కల పెంపకం ఎంతో అవసరమని అన్నారు.

సిద్ధిపేటలో చెట్టు-బొట్టు
X

గ్రీన్ సిద్ధిపేట టార్గెట్ గా పెట్టుకున్న మంత్రి హరీష్ రావు చెట్టు-బొట్టు కార్యక్రమంతో మున్సిపాల్టీని హరితవనంలా మార్చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో భాగంగా దశల వారిగా పట్టణాన్ని గ్రీన్‌ సిద్దిపేటగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటడంతోపాటు, వాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలనే సందేశంతో చెట్టు-బొట్టు పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి డ్వాక్రా మహిళలు బొట్టు పెట్టి మొక్కలను అందించి హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్‌ బ్యాక్‌ లో సిద్దిపేట రెండో స్థానంలో ఉందని చెప్పారు మంత్రి హరీష్ రావు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మొక్కల పెంపకం ఎంతో అవసరమని అన్నారు. మొక్కలు పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. 7.4 శాతం గ్రీన్‌ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు హరీష్ రావు. ఆరోగ్య పరిరక్షణ కోసం దవాఖానలు కట్టడంతోపాటు.. వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అతి ముఖ్యమన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిచాలని, వారి ఊపిరి తిత్తులను కాపాడాలన్నారు హరీష్ రావు.

వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో పండించిన పంట అందిచాలని చెప్పారు మంత్రి హరీష్ రావు. హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త ఏరడం ఒక మంచి పరిణామని వెల్లడించారు. దీనిద్వారా ప్రజల్లో అవగాహన కలుగుతుందన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు హరీష్ రావు.

First Published:  30 July 2023 5:16 AM GMT
Next Story