Telugu Global
Telangana

బీసీ గురుకులాల్లో 2,591 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

Telangana Gurukul Recruitment 2022: నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

Telangana Gurukul Recruitment 2022: బీసీ గురుకులాల్లో 2,591 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
X

బీసీ గురుకులాల్లో 2,591 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

పోలీసు శాఖ‌లో 3,966 కొత్త పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం మ‌హాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లోని ప‌లు విభాగాల్లో 2,591 నూత‌న ఉద్యోగాల నియామ‌కాల‌కు కూడా ఆమోదం తెలిపింది.

నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

రోడ్లు భవనాల శాఖలో పలు అదనపు పోస్టులకు కూడా మంత్రి వర్గం అనుమతి ఇచ్చింది. పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.

First Published:  10 Dec 2022 3:43 PM GMT
Next Story