Telugu Global
Telangana

మండలిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో రేవంత్.!

శాస‌న‌మండలిపై కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. కౌన్సిల్‌కు వెళ్తే ఇరానీ కేఫ్‌లో కూర్చొని రియల్‌ ఎస్టేట్‌ కొనుగోళ్లు, అమ్మకాల గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుందన్నారు

మండలిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో రేవంత్.!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస‌న మండలిని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్‌. సీఎం రేవంత్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు MS ప్రభాకర్‌, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి.

అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా శాస‌న‌మండలిపై కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. కౌన్సిల్‌కు వెళ్తే ఇరానీ కేఫ్‌లో కూర్చొని రియల్‌ ఎస్టేట్‌ కొనుగోళ్లు, అమ్మకాల గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. తను తొలిసారి మండలిలో అడుగుపెట్టిన సమయంలో మండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ నాగేశ్వర్ రావు లాంటి వాళ్లు ఉండేవారని వారిని చూసి చాలా నేర్చుకున్నానన్నారు రేవంత్.


అయితే మండలిని ఇరానీ కేఫ్‌తో , సభ్యులను రియల్‌ ఎస్టేట్ బ్రోకర్లతో పోల్చుతూ రేవంత్ కామెంట్ చేశారంటూ బీఆర్ఎస్ మండిపడింది. వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.

First Published:  9 Jan 2024 10:03 AM GMT
Next Story