Telugu Global
Telangana

సంపాదించే మహిళలు ఫ్రీ బస్‌ ఎక్కితే.. బిచ్చం ఎత్తుకున్నట్లు

ఫ్రీ బస్‌ స్కీమ్‌ మంచిదే అయినప్పటికీ.. టికెట్‌ కొనే స్థోమత ఉండి, నెలకు రూ.10 వేలు సంపాదించే మహిళలు ఫ్రీ బస్‌ ఎక్కితే తన దృష్టిలో బిచ్చమెత్తుకున్నట్లేనన్నారు.

సంపాదించే మహిళలు ఫ్రీ బస్‌ ఎక్కితే.. బిచ్చం ఎత్తుకున్నట్లు
X

కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఫ్రీ బస్‌ పథకంపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఫ్రీ బస్ స్కీమ్‌ ఉపయోగించుకుంటున్న మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ చర్చకు దారి తీశాయి.

ఇంతకీ కాటిపల్లి ఏమన్నారంటే.. ఫ్రీ బస్‌ స్కీమ్‌ మంచిదే అయినప్పటికీ.. టికెట్‌ కొనే స్థోమత ఉండి, నెలకు రూ.10 వేలు సంపాదించే మహిళలు ఫ్రీ బస్‌ ఎక్కితే తన దృష్టిలో బిచ్చమెత్తుకున్నట్లేనన్నారు. కుష్టు వచ్చి, భగవంతుడు చిన్న చూపు చూసి గుడి దగ్గర బిచ్చమెత్తుకునే వాళ్లతో సమానమన్నారు. రూ.10 వేలు సంపాదిస్తూ రూ.10 ఫ్రీ బస్‌ టికెట్‌ను ఎంజాయ్ చేయడం సరికాదన్నారు ఆయన. ఆ పది రూపాయలు పేదవాడికి చెందాల్సిన డబ్బు అన్నారు. ఇదే తరహాలో పెన్షన్ తీసుకున్నా, అవినీతి చేసినా, రైతుబంధు తీసుకున్నా, రేషన్‌ కార్డు తీసుకున్నా శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్లతో సమానమన్నారు.


ఇక కాటిపల్లి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. మీరు ఆస్తిపరులై ఉండి ఎమ్మెల్యేగా జీతం ఎందుకు తీసుకుంటున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ లాంటి అడ్రస్‌ ప్రూఫ్‌ చూపించి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ వెసులుబాటును మహిళలు వినియోగించుకోవచ్చు.

First Published:  11 Jan 2024 8:58 AM GMT
Next Story