Telugu Global
Telangana

ఛత్రపతి శివాజీ పాత్రలో రాజాసింగ్.. సినిమా ఎప్పుడంటే..!

బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నిక కావాలని రాజాసింగ్‌ మరో కోరిక. బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్‌ పర్యటన తర్వాత రాజాసింగ్‌లో ఉత్సాహం పెరిగింది.

ఛత్రపతి శివాజీ పాత్రలో రాజాసింగ్.. సినిమా ఎప్పుడంటే..!
X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సినిమాలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరాఠీ కింగ్ ఛత్రపతి శివాజీ పాత్రలో న‌టించాల‌న్నది రాజాసింగ్‌ కోరిక. ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందని సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను బీజేపీ సీనియర్లకు రాజాసింగ్‌ చూపించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. రాజాసింగ్‌ మాత్రం తన సినిమాపై నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నిక కావాలని రాజాసింగ్‌ మరో కోరిక. బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్‌ పర్యటన తర్వాత రాజాసింగ్‌లో ఉత్సాహం పెరిగింది. ఈ ఉత్సాహానికి కారణం బీజేఎల్పీ లీడర్ పదవి విషయంలో స్పష్టత రావడమే అని ప్రచారం జరుగుతోంది. అమిత్ షా రాజాసింగ్‌కు హామీ ఇచ్చారా.. లేదా.. అనే దానిపై స్పష్టత లేదు.

గోషామహల్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాజాసింగ్. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఎవరన్నదానిపై బీజేపీ ఇప్పటివరకూ తేల్చలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

First Published:  1 Jan 2024 5:42 AM GMT
Next Story