Telugu Global
Telangana

మాధవీలత ఓ కమెడీయన్‌.. గెలిచేది ఓవైసీనే - కేటీఆర్

హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్రంలోని బీజేపీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గత పదేళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఒక్క ఇనిస్టిట్యూట్ కూడా కేటాయించలేదన్నారు.

మాధవీలత ఓ కమెడీయన్‌.. గెలిచేది ఓవైసీనే - కేటీఆర్
X

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ గెలుపు ఖాయమన్నారు. ఆ విషయంలో ప్రశ్నే అవసరం లేదన్నారు కేటీఆర్. మాధవీలతను కమెడీయన్‌తో పోల్చారు. బీజేపీ కమెడీయన్‌ను ముందు పెట్టి డ్రామాలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ఎవరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారన్నారు కేటీఆర్. మాధవీలత తనను తాను ఫూల్‌ చేసుకుంటున్నారని విమర్శించారు.

ఎన్నికలు చాలా సీరియస్ ఇష్యూ అన్నారు కేటీఆర్. ఎన్నికలు అంటే బాణాలు సంధించడం, వీధుల్లో డ్యాన్సులు చేయడం కాదన్నారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగాల గురించి మాట్లాడాలన్నారు. దమ్ముంటే మోడీ ఏం చేశారో చెప్పాలన్నారు.

హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్రంలోని బీజేపీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గత పదేళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఒక్క ఇనిస్టిట్యూట్ కూడా కేటాయించలేదన్నారు. మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్‌, IIM, IIFT ఇవ్వాలని పదేళ్లు అడుగుతున్నామన్నారు.

First Published:  10 May 2024 10:03 AM GMT
Next Story