Telugu Global
Sports

ఆఖరిమ్యాచ్ లో నెగ్గితేనే భారత్ కు సెమీస్ బెర్త్!

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ రెండుగ్రూపులలోనూ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్-2 నాలుగోరౌండ్ పోరులో బంగ్లాదేశ్ పై భారత్ చచ్చీచెడీ నెగ్గినా ఇప్పటికీ సెమీస్ బెర్త్ కు గ్యారెంటీ లేకుండాపోయింది. ఆఖరిరౌండ్లో జింబాబ్వే పై నెగ్గితేనే భారత్ సెమీస్ చేరుకోగలుగుతుంది.

ఆఖరిమ్యాచ్ లో నెగ్గితేనే భారత్ కు సెమీస్ బెర్త్!
X

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ రెండుగ్రూపులలోనూ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్-2 నాలుగోరౌండ్ పోరులో బంగ్లాదేశ్ పై భారత్ చచ్చీచెడీ నెగ్గినా ఇప్పటికీ సెమీస్ బెర్త్ కు గ్యారెంటీ లేకుండాపోయింది. ఆఖరిరౌండ్లో జింబాబ్వే పై నెగ్గితేనే భారత్ సెమీస్ చేరుకోగలుగుతుంది...

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ పోటీలు అంచనాలకు మించి సాగిపోతున్నాయి. మొత్తం రెండు గ్రూపులలోనూ ఇప్పటి వరకూ జరిగిన నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని జట్టుగా కేవలం దక్షిణాఫ్రికా మాత్రమే నిలిచింది. మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లతో పాటు న్యూజిలాండ్ సైతం ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

హోరాహోరీగా గ్రూప్ లీగ్ సమరం..

భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లతో కూడిన గ్రూప్-2, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ జట్లతో నిండిన గ్రూప్-1 సమరంలో ఇప్పటి వరకూ ఏజట్టుకూ సెమీస్ బెర్త్ ఖాయం కాకపోడం విశేషం.

గ్రూప్ -2 మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ మూడు విజయాలు, ఓ పరాజయంతో 6 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచినా..సెమీస్ బెర్త్ కు గ్యారెంటీ లేకుండా పోయింది.

అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే హోరాహోరీ సమరానికి వానదెబ్బ తలిగినా చివరకు భారత జట్టు డక్ వర్త్ -లూయిస్ విధానం ద్వారా బంగ్లాను 5 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ఊపిరిపీల్చుకోగలిగింది. మొత్తం ఆరుపాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ లోనూ మెరుగైన స్థితిలోనే ఉన్నా...సెమీస్ చేరాలంటే ఈ నెల 6న మెల్బోర్న్ వేదికగా జరిగే ఆఖరిరౌండ్ పోటీలో జింబాబ్వేను భారీతేడాతో ఓడించి తీరక తప్పని పరిస్థితి నెలకొంది.

పాక్ కు సఫారీల గండం...

మరోవైపు..మాజీ చాంపియన్ పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆడిన మొదటి మూడురౌండ్లలో ఓ గెలుపు, రెండు పరాజయాలతో ఉన్న పాక్ జట్టు తన ఆఖరి రెండుమ్యాచ్ ల్లో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లపై నెగ్గితీరాల్సి ఉంది. నెదర్లాండ్స్- దక్షిణాఫ్రికాజట్ల ఆఖరిరౌండ్ మ్యాచ్ వర్షంతో రద్దయినా...లేక సఫారీలపై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించినా...పాక్ జట్టు సెమీస్ చేరుకోగలుగుతుంది.

లేదా...తన ఆఖరి రౌండ్ పోరులో జింబాబ్వే చేతిలో భారత్ భారీతేడాతో ఓడినా..మెరుగైన నెట్ రన్ రేట్ సాధించగలిగితే పాక్ సెమీస్ చేరే అవకాశం లేకపోలేదు. అయితే..

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ఈరోజు జరిగే నాలుగోరౌండ్ పోరులో దక్షిణాఫ్రికాను..ఆరునూరైనా పాక్ జట్టు ఓడించి తీరాల్సి ఉంది.

ఒకవేళ్ దక్షిణాఫ్రికా చేతిలో పాక్ జట్టు ఓటమి పాలైతే...సెమీస్ బెర్త్ రేస్ నుంచి వైదొలిగినట్లే అవుతుంది.

గ్రూప్ -1 లో అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లు సెమీస్ రేస్ నుంచి అవుట్ కాగా..ఆతిథ్య ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకజట్లు..సెమీస్ రెండు బెర్త్ ల కోసం పోటీలో ఉన్నాయి.

డచ్ జట్టు సూపర్....విన్!

ఇదే గ్రూపులో పోటీపడుతున్న పసికూన నెదర్లాండ్స్ జట్టు..తొలిసారిగా సూపర్ -12 రౌండ్ కు అర్హత సాధించడమే కాదు...తొలి సూపర్ విజయాన్ని సైతం నమోదు చేయగలిగింది.

అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన నాలుగోరౌండ్ లో జింబాబ్వే పై నెదర్లాండ్స్ 5 వికెట్ల సంచలన విజయం నమోదు చేసింది. గత 8సంవత్సరాలలో తొలిసారిగా ప్రపంచకప్ టీ-20 సూపర్ -12 రౌండ్ కు అర్హత సాధించిన నెదర్లాండ్స్...క్వాలిఫైయింగ్ రౌండ్లలోనూ నిలకడగా రాణించడం ద్వారా సత్తా చాటుకొంది.

తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన జింబాబ్వేతో జరిగిన పోరులో మీడియం పేసర్ పాల్ వాన్ మీకెరన్ 3 వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది.

సమాధానంగా చేజింగ్ కు దిగిన డచ్ జట్టు మరో 12 బంతులు మిగిలిఉండగానే 5 వికెట్ల నష్టానికే 120 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది. డచ్ ఆటగాడు మాక్స్ ఓ దౌడ్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇప్పటికే ...జింబాబ్వేతో కలసి సెమీఫైనల్స్ రేస్ నుంచి వైదొలగిన నెదర్లాండ్స్ తన ఆఖరిరౌండ్ పోరులో పాకిస్థాన్ తో పోటీపడాల్సి ఉంది.

First Published:  3 Nov 2022 3:31 AM GMT
Next Story