Telugu Global
Sports

అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ కు 8 ఏళ్ళ జైలు!

నేపాల్ యువక్రికెటర్ సందీప్ లామిచానేకి 8 సంవత్సరాల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా పడింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఈ శిక్ష విధించారు.

అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ కు 8 ఏళ్ళ జైలు!
X

నేపాల్ యువక్రికెటర్ సందీప్ లామిచానేకి 8 సంవత్సరాల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా పడింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఈ శిక్ష విధించారు.

నేపాల్ యువక్రికెటర్, లెగ్ స్పిన్ బౌలర్ సందీప్ లాంచానేకి చిన్నవయసులోనే పెద్ద శిక్ష పడింది. ప్రతిభావంతుడైన లెగ్ స్పిన్నర్ గా పేరున్న సందీప్ పై రెండేళ్లక్రితం నమోదు చేసిన అత్యాచారం కేసు పై ఖాట్మండూ జిల్లా కోర్టు తుదితీర్పును వెలువరించింది.

2022సెప్టెంబర్లో కేసు నమోదు ...

ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నేపాల్ జట్టు బౌలింగ్ కు వెన్నెముకలాంటి సందీప్ 2021 ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు 2022 సెప్టెంబర్ లో ఓ కేసు నమోదయ్యింది.

గతంలో ఐపీఎల్, ఆ తరువాత బిగ్ బాష్ లీగ్, కరీబియన్ లీగ్ టోర్నీలలో పాల్గొంటూ వస్తున్న సందీప్ ను స్వదేశానికి రప్పించి మరీ నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

18 సంవత్సరాల వయసులో పాల్పడిన ఈ నేరానికి బాలనేరస్తుడి కింద బయట పడటానికి సందీప్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాడు. కొద్దివారాలపాటు జైలుశిక్ష అనుభవించిన అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు ఇవ్వడంతో తిరిగి తన క్రికెట్ కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. నేపాల్ తరపున అంతర్జాతీయక్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొంటూ వచ్చాడు.

బాధితురాలికి పరిహారం..

మరోవైపు ..సందీప్ పై విచారణను నేపాల్ కోర్టు 2023 డిసెంబర్ 29న పూర్తి చేసి..అత్యాచారం కేసులో దోషిగా తేల్చి చెప్పింది. అయితే శిక్షను 2024 జనవరి 10 వరకూ రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

సందీప్ ఓ యువతి పై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో 8 సంవత్సరాల కారాగారవాసం, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు, బాధితురాలికి 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ ఖాట్మండూ జిల్లా కోర్టు న్యాయమూర్తి శిశీర్ రాజ్ ధకాల్ తీర్పు చెప్పారు.

గత రెండేళ్లుగా కొనసాగిన ఈ కేసు విచారణ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు పుణ్యమా అంటూ 2023 సీజన్ వరకూ విదేశీ క్రికెట్ లీగ్ ల్లో సందీప్ పాల్గొనగలిగాడు.

గతంలో కొద్దివారాలపాటు సుందర సెంట్రల్ జైలులో గడిపి వచ్చిన సందీప్ లాంచానే తన 8 సంవత్సరాల కారాగారవాసం శిక్షను ఖాట్మండూ జైలులో అనుభవించనున్నాడు.

క్రికెట్ ఫీల్డ్ లో రికార్డుల మోత మోగిస్తూ నేపాల్ జాతీయపతాకాన్ని రెపరెపలాడించాల్సిన 23 సంవత్సరాల సందీప్..8 సంవత్సరాలపాటు కారాగారవాసం అనుభవిస్తూ జైలు ఊసలు లెక్కపెట్టాల్సి రావడం దురదృష్టకరమే. నేపాల్ లో జన్మించిన కారణంగానే సందీప్ లాంటి మేటి క్రికెటర్ కు శిక్షపడింది. ఇదే భారత్ లో పుట్టిఉంటే మసిపూసి మారేడు కాయి చేసి ఉండేవారే.

First Published:  11 Jan 2024 7:12 AM GMT
Next Story