Telugu Global
Sports

భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. 2023 ఫిడే ప్రపంచకప్ పోటీల క్వార్టర్ ఫైనల్స్ కు భారత్ కు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు తొలిసారిగా చేరడం ద్వారా అరుదైన ఘనతను సాధించారు.

భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం!
X

భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. 2023 ఫిడే ప్రపంచకప్ పోటీల క్వార్టర్ ఫైనల్స్ కు భారత్ కు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు తొలిసారిగా చేరడం ద్వారా అరుదైన ఘనతను సాధించారు....

అజర్ బైజాన్ నగరం బాకు వేదికగా జరుగుతున్న 2023 ఫిడే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్ మాస్టర్లు తొలిసారి అర్హత సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద్ , గుకేశ్, తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి, గుజరాత్ కు చెందిన విదిత్ గుజరాతీ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించారు.

విశ్వనాథన్ ఆనంద్ సంతోషం...

ప్రస్తుత ప్రపంచకప్ చెస్ పోటీల క్వార్టర్ ఫైనల్స్ కు భారత్ కు చెందిన నలుగురు యువ గ్రాండ్ మాస్టర్లు చేరుకోడం పట్ల దిగ్గజ ఆటగాడు, సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు.

నలుగురు ఆటగాళ్లు ఒకే టోర్నీ క్వార్టర్స్ కు చేరడంతో భారత చదరంగం సత్తా ఏపాటిదో ప్రపంచానికి తెలిసి వచ్చిందని ఆనంద్ పొంగిపోయారు. భారత చదరంగ చరిత్రలో ఇదో గొప్ప పరిణామమని ప్రశంసించారు.

ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ ఓ వీడియో సందేశం ద్వారా భారత చదరంగ సమాఖ్యను అభినందించారు. ప్రపంచకప్ టోర్నీలలో సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ చేరడం సహజంగా జరుగుతూ ఉంటుందని..అయితే ప్రస్తుత ప్రపంచకప్ లో ఏకంగా నలుగురు భారత గ్రాండ్ మాస్టర్లు చేరడం అనూహ్యం, అద్భుతమంటూ మురిసిపోయారు.

సెమీఫైనల్లో తెలుగు గ్రాండ్ మాస్టర్...

భారత గ్రాండ్ మాస్టర్ల నడుమే జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో సంచలన ఆటగాడు ప్రజ్ఞానంద్ పై తెలుగు రాష్ట్ర్రాల యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి సంచలన విజయం సాధించడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించాడు.

క్వార్టర్స్‌లో అర్జున్‌ 53 ఎత్తుల్లో ప్రజ్ఞానంద్ ఆటకట్టించాడు. ప్రపంచకప్ సెమీస్ చేరడం అర్జున్ కెరియర్ లో ఇదే మొదటిసారి. అయితే..మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేతిలో తమిళనాడు గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌ కు పరాజయం తప్పలేదు. నల్లపావులతో పోరుకు దిగిన కార్ల్‌సన్‌..గుకేశ్‌కు చెక్‌పెట్టాడు. మూడో క్వార్టర్ ఫైనల్లోనిజాత్‌ అబసోవ్‌తో విదిత్‌ గుజరాతి తలపడాల్సి ఉంది.

First Published:  16 Aug 2023 1:15 PM GMT
Next Story