Telugu Global
Sports

భారత చెస్ 'నంబర్ వన్' గా తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్!

తెలంగాణా చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి చరిత్ర సృష్టించాడు.తొలిసారిగా భారత చదరంగ టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు.

భారత చెస్ నంబర్ వన్ గా తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్!
X

తెలంగాణా చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి చరిత్ర సృష్టించాడు.తొలిసారిగా భారత చదరంగ టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు.

భారత చదరంగంలో తెలంగాణా ఏకైక గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసీ తన కెరియర్ లో తొలిసారిగా భారత టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు. యువ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీలతో పాటు సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ను సైతం ర్యాంకింగ్స్ లో తొలిసారిగా అధిగమించాడు.

అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత గ్రాండ్ మాస్టర్లలో అర్జున్ ఇరగేసి అత్యుత్తమ ర్యాంక్ నమోదు చేయగలిగాడు.

2756 పాయింట్లతో అర్జున్ ఇరగేసీ టాప్...

భారత గ్రాండ్ మాస్టర్లలో అర్జున్ ఇరగేసీ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో అర్జున్ ఇరగేసి తరువాతి స్థానంలో నిలిచాడు.

ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద్ 2747 పాయింట్లతో 14వ ర్యాంకులోనూ, గుకేశ్ 2743 పాయింట్లతో 16వ ర్యాంకులోనూ, విదిత్ గుజరాతీ 2727 పాయింట్లతో 25వ ర్యాంక్ లో కొనసాగుతున్నారు.

18 సంవత్సరాల ప్రజ్ఞానంద్, 17 ఏళ్ల గుకేశ్, 29 ఏళ్ళ గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ కెనడా వేదికగా ప్రారంభంకానున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో తలపడనున్నారు.

మహిళల క్యాండిడేట్స్ టోర్నీలో గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలీ భారత్ తరపున పోటీకి దిగుతున్నారు.

First Published:  2 April 2024 12:21 PM GMT
Next Story