Telugu Global
Sports

చెస్‌లో చిచ్చ‌ర‌పిడుగు.. ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే గ్రాండ్ మాస్ట‌ర్‌పై గెలుపు

చెస్‌లో సింగపూర్ త‌ర‌ఫున ఆడుతున్న అశ్వ‌త్ స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్మాస్టర్ జాక్ స్టోపాను చిత్తు చేశాడు. క్లాసికల్ చెస్లో పిన్న వయసులో గ్రాండ్ మాస్ట‌ర్‌ను ఓడించిన ఆటగాడిగా అశ్వత్ (8 సంవత్సరాల 6 నెలల 11 రోజులు) ఘనత సాధించాడు.

చెస్‌లో చిచ్చ‌ర‌పిడుగు.. ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే గ్రాండ్ మాస్ట‌ర్‌పై గెలుపు
X

వ‌య‌సు ఎనిమిదేళ్లే. చెస్ ఆట‌గాడు. ఫిడే ర్యాంకు చూస్తే 37,338. కానీ పిట్ట కొంచెం కూత ఘ‌నం అని నిరూపించాడు. స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్ మాస్ట‌ర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. క్లాసిక‌ల్ చెస్‌లో పిన్న వ‌య‌సులో గ్రాండ్ మాస్ట‌ర్‌ను ఓడించిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. భార‌త సంత‌తికి చెందిన ఆ పిల్లాడి పేరు అశ్వ‌త్ కౌశిక్‌.

అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డు

చెస్‌లో సింగపూర్ త‌ర‌ఫున ఆడుతున్న అశ్వ‌త్ స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్మాస్టర్ జాక్ స్టోపాను చిత్తు చేశాడు. క్లాసికల్ చెస్లో పిన్న వయసులో గ్రాండ్ మాస్ట‌ర్‌ను ఓడించిన ఆటగాడిగా అశ్వత్ (8 సంవత్సరాల 6 నెలల 11 రోజులు) ఘనత సాధించాడు. 8 సంవ‌త్స‌రాల 11 నెల‌ల 7 రోజుల‌కే గ్రాండ్

మాస్ట‌ర్‌ను ఓడించిన సెర్బియా పిల్లాడు యోనిడ్ ఇవానోవిచ్ రికార్డును అశ్వ‌త్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఇంత‌కీ అత‌ను ఓడించిన గ్రాండ్ మాస్ట‌ర్ స్టోపా వ‌య‌సెంతో తెలుసా. ఏకంగా 37 సంవ‌త్స‌రాలు.

సింగ‌పూర్‌కు వ‌ల‌స వెళ్లిన కుటుంబం

అశ్వ‌త్ కౌశిక్ కుటుంబం 2017లో ఇండియా నుంచి సింగపూర్‌కు వ‌ల‌స వెళ్లింది. అప్ప‌టి నుంచి చెస్‌లో రాటుదేలుతున్నాడు. రోజూ 7 గంట‌లు చెస్‌బోర్డుకు అతుక్కుపోయే అశ్వ‌త్ 2022లో ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో అశ్వత్ ఆరేళ్ల వ‌య‌సులోనే అండర్-8 క్లాసిక్, ర్యాపిడ్ బ్లిట్జ్‌ టైటిళ్లు గెలిచి సంచ‌ల‌నం సృష్టించాడు.

First Published:  21 Feb 2024 8:11 AM GMT
Next Story