Telugu Global
Science and Technology

యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్! ఫీచర్లు ఇవే..

టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. రీసెంట్‌గా జరిపిన ఈవెంట్‌లో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో రెండు ఐపాడ్‌లు, ఒక పెన్సిల్ స్టిక్ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరల వివరాల్లోకి వెళ్తే.

యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్! ఫీచర్లు ఇవే..
X

టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. రీసెంట్‌గా జరిపిన ఈవెంట్‌లో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో రెండు ఐపాడ్‌లు, ఒక పెన్సిల్ స్టిక్ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరల వివరాల్లోకి వెళ్తే..

మార్చి 7న యాపిల్ కంపెనీ నిర్వహించిన ‘లెట్‌లూజ్‌’ అనే ఈవెంట్‌లో రెండు కొత్త ఐప్యాడ్‌ వెర్షన్స్‌ను రిలీజ్ చేసింది. ‘ఐప్యాడ్ ఎయిర్‌’ , ‘ఐప్యాడ్‌ ప్రో’ పేర్లతో లాంఛ్ అయిన ఈ ప్రొడక్ట్స్.. యాపిల్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఐప్యాడ్‌ ఎయిర్‌ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇది లేటెస్ట్ యాపిల్ ఎం2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 11 , 13 ఇంచెస్ వేరియంట్లు ఉన్నాయి. రెండు స్క్రీన్స్‌లో.. లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే ఉంటుంది. వీటిలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వెనుక 12 ఎంపీ వైడ్‌ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఐప్యాడ్‌ ఎయిర్‌ 11 ఇంచెస్ ధర రూ.59,900 నుంచి మొదలవుతుంది. 13 ఇంచెస్ వేరియంట్ ధర రూ.79,900 నుంచి మొదలవుతుంది. వీటిలో ఓన్లీ వైఫై, వైఫై +సెల్యులార్‌ మోడల్స్ ఉన్నాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక ఐప్యాడ్‌ ప్రో విషయానికొస్తే ఇందులో లెటెస్ట్ ఎం4 చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో కూడా 11 అంగుళాలు, 13 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. ఇది టెన్‌డమ్ ఓఎల్‌ఈడీ అల్ట్రా రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. ముందు, వెనుకా 12 మెగాపిక్సెల్ కెమెరాలుంటాయి. సిల్వర్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. 11 ఇంచెస్ ఐప్యాడ్‌ ప్రో ధర రూ.99,900 నుంచి మొదలవుతుంది. 13 ఇంచెస్ మోడల్ ధర రూ.1,29,900 నుంచి మొదలవుతుంది. వైఫై, వైఫై+ సెల్యూలార్ వేరియంట్లు ఉన్నాయి. 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక పెన్సిల్‌ ప్రో విషయానికొస్తే.. ఇందులో స్క్వీజ్, బారెల్ రోల్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వంటి ఫీచర్లున్నాయి. ఇది ఐప్యాడ్‌ను ఆపరేట్ చేయడానికి పనికొస్తుంది. దీని ధర రూ.11,900 ఉంది.

First Published:  9 May 2024 1:01 PM GMT
Next Story