Telugu Global
Science and Technology

ఈ ఏడాది గూగుల్ సెర్చ్ చేసిన విషయాలివే..

గూగుల్ ప్రతి ఏటా రిలీజ్ చేసే ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ సంవత్సరం ఎక్కువమందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, మూవీస్.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.

ఈ ఏడాది గూగుల్ సెర్చ్ చేసిన విషయాలివే..
X

చూస్తుండగానే ఏడాది ముగిసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. అయితే ప్రతీ ఏటా ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలను ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2023’ పేరుతో ప్రకటిస్తుంది గూగుల్ . మరి ఈ ఏడాది గూగుల్‌లో ఏమేం విషయాలు ఎక్కువగా సెర్చ్ చేశారో తెలుసుకుందామా!

గూగుల్ ప్రతి ఏటా రిలీజ్ చేసే ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ సంవత్సరం ఎక్కువమందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, మూవీస్.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటిపై బ్రీఫ్‌గా ఓ లుక్కేస్తే..

ఈ ఏడాది ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షించిన అంశాల్లో ఇజ్రాయెల్ వార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత టైటానిక్ సబ్‌మెరిన్, టర్కీ భూకంపం వంటివి ఉన్నాయి. వ్యక్తుల లిస్ట్‌లో అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ దామర్ హ్యామ్లిన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సెర్చ్ చేసిన సినిమాల్లో బార్బీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత ఓపెన్ హైమర్, షారుఖ్ ఖాన్ జవాన్, సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్, జాన్‌విక్ చాప్టర్–4 వంటివి ఉన్నాయి.

ఇక మనదేశం విషయానికొస్తే.. న్యూస్ టాపిక్స్‌లో చంద్రయాన్–3 గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత కర్నాటక ఎలక్షన్స్, బడ్జెట్ 2023, ఒడిశా రైలు ప్రమాదం వంటి విషయాలు టాప్‌లో ఉన్నాయి. మనదేశంలో ‘వాట్ ఈజ్?’ అనే క్యాటగిరిలో జీ20, యూనిఫామ్ సివిల్ కోడ్, ఛాట్ జీపీటీ, హమాస్ వంటివి ఉన్నాయి. ‘హౌ టు’ అనే క్యాటగిరీలో ‘సన్ డ్యామేజీ నుంచి జుట్టు, చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?’ అని ఎక్కువమంది వెతికారు. అలాగే ‘యూట్యూబ్‌లో ఐదు వేల సబ్‌స్కైబర్లు ఎలా పొందాలి?’, ‘కబడ్డీ ఎలా ఆడాలి?’, ‘కారు మైలేజీ ఎలా పెంచుకోవాలి?’, ‘చెస్ గ్రాండ్ మాస్టర్ ఎలా అవ్వాలి?’ అనే విషయాలు ఎక్కువగా రీసెర్చ్ చేశారు.

స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరిలో ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కువమంది సెర్చ్ చేసిన క్రికెటర్‌‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. మనదేశంలో ఎక్కువమంది గూగుల్ చేసిన వ్యక్తుల లిస్ట్‌లో బాలీవుడ్ యాక్ట్రెస్ కియారా అద్వాని ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆమె తర్వాత క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, ఇండియన్ బౌలర్ మహ్మద్‌ షమీ, ఆసీస్‌ క్రికెటర్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో ఉన్నారు.

టూరిస్ట్ ప్లేసుల విషయానికొస్తే.. ఈ ఏడాది ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసింది వియత్నాం గురించి. ఆ తర్వాత గోవా, ఇండోనేషియాలోని బాలి, శ్రీలంక, థాయ్‌లాండ్‌ వంటి ప్రాంతాలున్నాయి.

First Published:  13 Dec 2023 6:08 AM GMT
Next Story