Telugu Global
Science and Technology

మొబైల్‌లో ఫొటోలు తీసేటప్పుడు ఈ సెట్టింగ్స్ మార్చండి!

మొబైల్‌లో తరచూ ఫొటోలు తీసేవాళ్లు కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ను మార్చుకోవాలి.

మొబైల్‌లో ఫొటోలు తీసేటప్పుడు ఈ సెట్టింగ్స్ మార్చండి!
X

ఎక్కడికైనా వెళ్లినప్పుడు లేదా ఫ్రెండ్స్‌ను కలిసినప్పుడు గుర్తుగా మొబైల్‌తో ఫోటోలు తీస్తుంటారు చాలామంది. అయితే కొన్ని బేసిక్ టిప్స్ పాటించడం ద్వారా ఆ ఫొటోలను మరింత అందంగా తీర్చిదిద్దొచ్చు. అదెలాగంటే.

మొబైల్‌లో తరచూ ఫొటోలు తీసేవాళ్లు కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ను మార్చుకోవాలి. ముందుగా ఫొటో ఫ్రేమ్ సైజుని 9:16 లేదా 16:9 లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా ఫుల్ సైజ్ ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది. అలాగే ఇమేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి క్వాలిటీ ‘హై’ లో ఉందో లేదో చూసుకోవాలి.

మొబైల్‌లో ఫొటోతీసేటప్పుడు బయట ఎండ లేదా లైటింగ్ ఎక్కువగా ఉంటే హెచ్‌డీఆర్ మోడ్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఈ మోడ్ ఆన్ చేయడం వల్ల దూరంగా ఉన్న లొకేషన్, వ్యక్తులు కూడా క్లియర్‌‌గా కనిపించే వీలుంటుంది.

ఇప్పుడొస్తున్న మొబైల్స్‌లో రెండు మూడు కెమెరాలుంటున్నాయి. అయితే 50 ఎంపీ, 64 ఎంపీ.. ఇలా హయ్యెస్ట్ రిజల్యూషన్ ఉన్న ఫోన్స్‌లో వాటికోసం సెపరేట్‌గా ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్‌లో ఉంచి తీస్తేనే ఆ రిజల్యూషన్‌లో ఫొటో వస్తుంది. లేకపోతే డీఫాల్ట్‌గా తక్కువ రిజల్యూషన్‌తో ఫొటోక్యా్ప్చర్ అవుతుంది. అందుకే ఫోటో తీసేటప్పుడు మోర్ లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ 50ఎంపీ లేదా 108 ఎంపీ ఇలా.. సెపరేట్ ఫీచర్ కనిపిస్తే దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.

మొబైల్‌లో ఫొటోలు తీసేటప్పుడు చాలామంది జూమ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇమేజ్ క్వాలిటీ తగ్గపోతుంది. కావాలంటే మీరే దగ్గరికి వెళ్లి తీయాలి. కానీ, జూమ్ మాత్రం చేయొద్దు.

మొబైల్‌లో ఫొటోలు తీసేటప్పుడు ఫ్లాష్ వాడడం వల్ల ఇమేజ్ నేచురల్‌గా కనిపించదు. ఏమాత్రం లైటింగ్ లేనప్పుడు మాత్రమే ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. మిగతా సమయాల్లో దాన్ని ఆఫ్ చేయాలి.

మొబైల్ కెమెరాతో ఫోటోలు తీసేటప్పుడు స్క్రీన్ మీద ఎక్స్‌పోజర్ స్కేల్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న లైటింగ్‌ను బట్టి దాన్ని తగ్గించడం లేదా పెంచడం ద్వారా ఫొటో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

మొబైల్‌లో ఫొటో తీసేటప్పుడు చేతికి కదలకుండా స్టడీగా పట్టుకోవాలి. అప్పుడే ఇమేజ్ బ్లర్ అవ్వకుండా సరిగ్గా వస్తుంది. అలాగే ఇమేజ్ క్లిక్ మనిపించేముందు సబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఫోకస్ చేయడం కూడా చాలామంది మర్చిపోతుంటారు. సబ్జెక్ట్ మీద ట్యాప్ చేయకపోతే ఫ్రేమ్‌లో ఉన్న వేరే సబ్జెక్ట్ ఫోకస్ అయ్యి మిగతాది బ్లర్ అయ్యే అవకాశం ఉంది.

ఇక చివరిగా మొబైల్ కెమెరాలో మంచి ఫొటోలు రావాలంటే లెన్స్ మీద గీతలు పడకుండా చూసుకోవాలి. అలాగే ఫొటో తీసేముందు లెన్స్‌ను ఒకసారి క్లీన్ చేస్తే ఇమేజ్ ఇంకా స్పష్టంగా వస్తుంది.

First Published:  25 March 2024 12:30 AM GMT
Next Story