Telugu Global
Science and Technology

Lenovo Tab M11 | అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో లెనోవో టాబ్ ఎం11.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌..!

Lenovo Tab M11 | లెనోవో టాబ్ ఎం11 (Lenovo Tab M11) రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. వై-ఫై ఆప్ష‌న్ మాత్ర‌మే గ‌ల లెనోవో టాబ్ ఎం11 రూ.17,999, ఎల్‌టీఈ వేరియంట్ విత్ లెనోవో టాబ్ పెన్ రూ.21,999ల‌కు ల‌భిస్తుంది.

Lenovo Tab M11 | అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో లెనోవో టాబ్ ఎం11.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌..!
X

Lenovo Tab M11 | ప్ర‌ముఖ చైనా టెక్నాల‌జీ సంస్థ లెనోవో (Lenovo) త‌న టాబ్లెట్ లెనోవో టాబ్ ఎం11 (Lenovo Tab M11)ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. గ‌త జ‌న‌వ‌రిలో జ‌రిగిన క‌న్జూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌)-2024లో తొలుత దీన్ని ప్ర‌ద‌ర్శించింది. మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ (MediaTek Helio G88 SoC) ప్రాసెస‌ర్‌తో వ‌స్తున్న ఫోన్ ఆండ్రాయిడ్‌పై ప‌ని చేస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ, 15 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 7000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుందీ టాబ్లెట్‌.

లెనోవో టాబ్ ఎం11 (Lenovo Tab M11) రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. వై-ఫై ఆప్ష‌న్ మాత్ర‌మే గ‌ల లెనోవో టాబ్ ఎం11 రూ.17,999, ఎల్‌టీఈ వేరియంట్ విత్ లెనోవో టాబ్ పెన్ రూ.21,999ల‌కు ల‌భిస్తుంది. లెనోవో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ గ‌ల లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్.. 11-అంగుళాల డ‌బ్ల్యూయూఎక్స్‌జీఏ (1,920 x 1,200 పిక్సెల్స్‌) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ క‌లిగి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కోసం హెచ్‌డీ క్వాలిటీకి మ‌ద్ద‌తునిస్తుంది. అందుకు లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్ టీయూవీ రేన్‌లాండ్ స‌ర్టిఫికెట్‌తో వ‌స్తున్న‌ది.

లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ యూఐ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందిది. రెండేండ్ల పాటు ఓఎస్‌, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. లెనోవో టాబ్ పెన్‌తో పోలిస్తే ఈ టాబ్లెట్ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ ఆడియో మ‌ద్ద‌తుతో క్వాడ్ స్పీక‌ర్ల‌తో వ‌స్తున్నది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ తోపాటు రాయడానికి, డ్రాయింగ్ కోసం డిజిటల్ పెన్స్ ఉంటాయి.లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్ 15 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 7040 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.1 క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్‌లో స్టైల‌స్ ఇన్‌పుట్ స‌దుపాయం ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా వ‌స్తున్న‌ `నెబో`యాప్ సాయంతో నోట్స్ రాసుకునే వెసులుబాటు ఉంట‌ది. యూజ‌ర్ల చేతిరాత‌ను ఈ నెబో యాప్ టెక్ట్స్‌గా మార్చివేస్తుంది. క‌ఠిన‌మైన మ్యాథ్స్ ఈక్వేష‌న్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి మైస్క్రిప్ట్ క్యాలిక్యులేట‌ర్‌ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ల మేనేజ్‌మెంట్ కోసం డ‌బ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్ ఉంటుంది. లెనోవో ఫ్రీ స్ట‌యిల్ యాప్ సాయంతో టాబ్లెట్‌ను ఒక ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌కి గానీ, మ‌రొక టాబ్లెట్‌కు లింక్ చేసుకోవ‌చ్చు.

First Published:  27 March 2024 8:25 AM GMT
Next Story