పొద్దున్నే ఇలా చేస్తే రోజంతా హ్యాపీగా ఉండొచ్చు!

మార్నింగ్ రొటీన్
రోజులో మొదట చేసే పనులను బట్టే ఆ రోజు మూడ్ డిపెండ్ అవుతుందనేది మానసిక నిపుణులు చెప్పే మాట. ముఖ్యంగా ఉదయాన్నే కొన్ని పనులు చేయడం ద్వారా రోజంతా చాలా హ్యాపీగా ఉండొచ్చట. అవేంటంటే..
సన్‌రైజ్‌కు ముందు
శరీరంలోని ప్రాణ శక్తికి.. సూర్యుడితో సంబంధం ఉంటుంది. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం ద్వారా శరీరంలో సహజంగానే ఉత్సాహం పెరుగుతుందట.
నీళ్లు తాగితే
నిద్ర లేవగానే శరీరం మొదట కోరుకునేది నీటినే. ఉదయాన్నే తాగే నీళ్లు శరీరంలోని ప్రతికణానికి చేరతాయి. తద్వారా శరీరమంతా యాక్టివేట్ అవుతుంది. రోజంతా హాయిగా అనిపిస్తుంది.
సన్‌లైట్
శరీరానికి ఆహారం, నీటితోపాటు సూర్యరశ్మి కూడా అవసరం. కాబట్టి ఉదయం పూట ఇరవై నిముషాలు ఎండలో నిల్చుంటే శరీరం ఛార్జ్ అవుతుంది. ఇది హార్మోనల్ బ్యాలెన్స్‌కు కూడా మంచిది.
మెడిటేషన్
ఉదయాన్నే ఇరవై నిముషాల పాటు కళ్లు మూసుకుని సైలెంట్‌గా కూర్చోవడం లేదా తేలికపాటి సంగీతం వినడం వంటివి చేయడం ద్వారా రోజంతా ప్రశాతంగా అనిపిస్తుందట.
గ్రాటిట్యూడ్
ఉదయాన్నే మనసుని కృతజ్ఞతా భావంతో నింపుకోవడం వల్ల రోజంతా పాజిటివ్‌గా గడపొచ్చని మానసిక డాక్టర్లు చెప్తున్నారు. కళ్లు మూసుకుని ప్రకృతికి, జీవితంలో మీకు తోడుగా మనుషులకు.. థ్యాంక్స్ చెప్తూ రోజుని మొదలుపెట్టాలట.
ఎక్సర్‌‌సైజ్
ఇక వీటితోపాటు ఉదయాన్నే కొద్దిపాటి స్ట్రెచింగ్ లేదా వర్కవుట్స్ వంటివి చేస్తే శరీరం మరింత చురుగ్గా పనిచేస్తుంది. బద్ధకం, అలసట వంటివి ఉండవు.