ఈ బ్లడ్ టెస్ట్‌లు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి!

టెస్ట్ ద్వారానే
ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా సోకే జబ్బులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అందుకే అనారోగ్యం వచ్చినప్పుడే కాకుండా ఏడాదికోసారి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయిచుకోవడం చాలా ముఖ్యం అని చెప్తున్నారు డాక్టర్లు. అవేంటంటే.
థైరాయిడ్ టెస్ట్
థైరాయిడ్ సమస్య లక్షణాలు లేకుండానే మొదలవుతుంది. కాబట్టి మీ శరీరంలో థైరాయిడ్ -హార్మోన్ పనితీరు ఎలా ఉందో ఏడాదికోసారి టెస్ట్ చేసి తెలుసుకోవడం ఉత్తమం.
రక్త కణాల ఆరోగ్యం
శరీరంలో రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి ఏడాదికోసారి కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకోవాలి. ఎర్ర రక్తకణాల సంఖ్య, తెల్ల రక్త కణాల సంఖ్యను బట్టి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
లిపిడ్ ప్రొఫైల్
చెప్పాపెట్టకుండా వచ్చే గుండె సమస్యలను కొలెస్ట్రాల్ ముఖ్య కారణంగా ఉంటోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్‌ను తప్పక చెక్ చేసుకోవాలి.
డయాబెటిస్
ముందుగా డయాబెటిస్‌ను గుర్తించకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి వయసు 30 దాటిన వాళ్లు ఆరు నెలలకోసారి తప్పకుండా డయాబెటిస్, బీపీ వంటి పరీక్షలు చేయించుకుంటే మంచిది.
లివర్ ఫంక్షన్
కాలేయం పనితీరు దెబ్బతినడం ద్వారా రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏడాదికోసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.
కంప్లీట్ విటమిన్ ప్రొఫైల్
సమస్య ఉన్నా లేకపోయినా ఏడాదికోసారి కంప్లీట్ విటమిన్ ప్రొఫైల్ టెస్ట్ చేయించాలి. ఈ టెస్ట్ ద్వారా ఎదైనా విటమిన్ లోపించిదేమో తెలుసుకోవచ్చు. తద్వారా సమస్య మొదలవ్వకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.