Telugu Global
NEWS

ధనవంతులుగా మరణిస్తున్న నిరుపేద వృద్ధులు.. ఎందుకంటే

భారతీయ సీనియర్ సిటిజన్లు తరువాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే ఛట్రం నుంచి ముందు బయటపడాలి. రియల్ ఎస్టేట్, విద్యలో భావోద్వేగ పెట్టుబడులు, స్వీయ సంరక్షణలను పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి.

ధనవంతులుగా మరణిస్తున్న నిరుపేద వృద్ధులు.. ఎందుకంటే
X

ఇది చాలా విచిత్రమైన విషయం. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నిజమే అని మీరు అనుకునే విషయం. ఇంతకీ ఏంటంటే.. మన దేశంలో చాలామంది వృద్ధులు చనిపోయేటప్పుడు ధనవంతులుగా మరణిస్తున్నారు కానీ, ధనవంతులుగా జీవించడం లేదు. మీకు నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదీ అక్షర సత్యం. ధనవంతులుగా మరణిస్తున్న వృద్ధులందరూ తమ జీవితాన్ని ఫణ్ణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తారు. అలా జీవితాంతం కష్టపడి డబ్బు సంపాదిస్తూ ధనవంతులుగా జీవించే విలువైన సమయాన్ని పోగుట్టుకుంటున్నారు. డబ్బు సంపాదిస్తూ పొదుపు చేస్తూ ఉంటారు. తమ కోసం, తమ ఆనందాల కోసం వాళ్లు డబ్బు ఖర్చుపెట్టరు. వారు సంపాదించే ప్రతీ రూపాయిని చాలా పొదుపుగా ఖర్చు పెడతారు. ప్రతీ రూపాయిని కూడబెట్టి తమ తరువాత తరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. దీనివల్ల చాలామంది వృద్ధులు ధనవంతులైనాపేదరికంలో జీవిస్తున్నారు. అలా ధనవంతులైన వృద్ధులు పేదలుగానే మరణిస్తున్నారు.

యువతరం రియల్ ఎస్టేట్, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులకు దూరం అవుతుండగా వృద్ధులు మాత్రం ఆ రంగాలనే అట్టిపెట్టుకుని ఉంటున్నారు. దశాబ్దాలుగా ఆ ఆస్తులతో మానసిక బంధం ఏర్పాడటంతో వృద్ధులు ఆ రంగాలను వీడటం లేదు. యువతరం యొక్క మారుతున్న అభిరుచులు, ప్రాధాన్యతలను.. సీనియర్ సిటిజన్ల ఖర్చులను అర్థం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లోని వృద్ధులు తమ శ్రేయస్సు, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తరువాతి తరాన్ని ధనవంతులుగా చేసే జీవన చక్రం నుంచి విముక్తి కావాలని సూచిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు తమకు మాత్రమే కాకుండా తమ పిల్లలకు విదేశాల్లో.. వివిధ రాష్ట్రాల్లో కూడా ఇళ్లు నిర్మిస్తున్నారు.



వృద్ధులకు విరుద్ధంగా యువతరం సరళ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులకు వారు దూరంగా ఉన్నారు. బదులుగా స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఆదాయ ప్రణాళికలు, క్రిప్టో-కరెన్సీ వంటి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలా యువతరం మారేందుకు అధిక ఆదాయం ఆర్జించాలన్నదే ప్రధాన కారణం. ప్రపంచ పెట్టుబడి ధోరణులు ప్రభావం కూడా యువతరంపై ఉంది.

ధనవంతులైన వృద్ధులు తమ సంపదను కూడబెట్టినప్పటికీ ధనవంతులుగా జీవించకపోవడానికి మరొక కారణం పెరుగుతున్న ఖర్చులు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ద్రవ్యోల్బణం, సరైన పదవీ విరమణ ప్రణాళిక లేకపోవడం వృద్ధుల పొదుపు ప్రణాళికలను తగ్గిస్తుంది. తర్వాత ఇది వారి భవిష్యత్తును ఆస్వాదించడానికి పరిమిత వనరులే ఉండేలా చేస్తుంది. భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య, సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం, అత్యవసర పరిస్థితి వంటి కారణాల కోసం వారి సంవత్సరాల పొదుపును ఇచ్చేస్తున్నారు. యువతరాన్ని ఆదుకునేందుకు వృద్ధులు తాము దాచుకున్న డబ్బును వదులుకోవాల్సి రావడం వారిపై ఎక్కువ భారాన్ని మోపుతోంది. ఇది సీనియర్ సిటిజన్లు విలాసాలను పరిమితం చేస్తుంది. వృద్ధులు తమ పిల్లల కోరికలు, అవసరాలకు మద్దతు ఇవ్వడం వారి ఆర్థిక శ్రేయస్సును పొందడం మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం.

భారతీయ సీనియర్ సిటిజన్లు తరువాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే ఛట్రం నుంచి ముందు బయటపడాలి. రియల్ ఎస్టేట్, విద్యలో భావోద్వేగ పెట్టుబడులు, స్వీయ సంరక్షణలను పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా, సీనియర్ సిటిజన్లు గొప్ప జీవితాన్ని గడపవచ్చు. రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండగలరు. కొత్త పెట్టుబడి అవకాశాలను స్వీకరించడం ద్వారా నిజంగా ధనవంతులుగా జీవించగలరు.

First Published:  2 Jan 2024 2:04 AM GMT
Next Story