Telugu Global
NEWS

సానియా-మాలిక్ విడాకులు.. మరో పెళ్లి చేసుకున్న క్రికెటర్

కొన్ని నెలల కిందట జరిగిన కుమారుడి బర్త్ డే వేడుకలో కూడా సానియా, మాలిక్ ఎడమొహం పెడమొహంగా కనిపించారు. దీంతో అప్పటినుంచి వీరిద్దరూ విడిపోతున్నారని ప్రచారం మొదలైంది.

సానియా-మాలిక్ విడాకులు.. మరో పెళ్లి చేసుకున్న క్రికెటర్
X

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారమే ప్రస్తుతం నిజమైంది. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మాలిక్ వెల్లడించాడు. పెళ్లి సమయంలో సనాతో తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు.

2010లో తన మొదటి భార్య అయేషాకు విడాకులు ఇచ్చిన మాలిక్ సానియా మీర్జాను అదే ఏడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2018లో ఓ కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉంటే కొంతకాలంగా మాలిక్- సానియా మీర్జా దూరంగా ఉంటున్నారు. సానియా హైదరాబాద్‌లో, మాలిక్ పాకిస్తాన్‌లో ఉంటున్నాడు.

కొన్ని నెలల కిందట జరిగిన కుమారుడి బర్త్ డే వేడుకలో కూడా సానియా, మాలిక్ ఎడమొహం పెడమొహంగా కనిపించారు. దీంతో అప్పటినుంచి వీరిద్దరూ విడిపోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు.

గత బుధవారం సానియా సోషల్ మీడియా వేదికగా వివాహ బంధం అత్యంత క్లిష్టమైనదని, విడాకులు కూడా అంతే కష్టమైనవ‌ని.. పోస్ట్ చేసింది. దీంతో మరోసారి సానియా, మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాలిక్ తాను సనాను మూడో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సనాకు ఇది రెండో పెళ్లి. 2020లో పాకిస్తాన్ కు చెందిన ఓ సింగర్ ను పెళ్లి చేసుకున్న సనా 2023లో అతడి నుంచి విడిపోయింది.

First Published:  20 Jan 2024 10:48 AM GMT
Next Story