Telugu Global
National

ఐఐటీ వెజిటేరియన్.. ఇదెక్కడి గొడవ

తమని అవమానిస్తున్నారంటూ నాన్ వెజిటేరియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీల్లో కూడా ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఐఐటీ వెజిటేరియన్.. ఇదెక్కడి గొడవ
X

మోదీ హయాంలో దేశవ్యాప్తంగా వేషభాషలు, తిండిపై జరుగుతున్న గొడవ అంతా ఇంతా కాదు. అసలు సమస్యలు పక్కకిపోయి.. ఏం తినాలి, ఏం ధరించాలి అనేవి హైలెట్ అవుతున్నాయి. తాజాగా బాంబే ఐఐటీలో కూడా ఇలాంటి చర్చ మొదలవడం నిజంగా బాధాకరం. దేశంలోనే అత్యుతమ విద్యాసంస్థలుగా పేరున్న ఐఐటీల్లో కూడా విద్యార్థుల మధ్య వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే గ్రూపులు ఏర్పడ్డాయి. చివరకు ఇవి గొడవలకు దారితీయడం ఆందోళనకరంగా మారింది.

బాంబే ఐఐటీలో శాకాహారులు- మాంసాహారుల వివాదం రాజుకుంది. క్యాంటీన్ లో మాంసాహారం తిన్నందుకు ఓ విద్యార్థిని మరో విద్యార్థి కించపరిచేలా మాట్లాడాడు. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ వివాదం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్‌ లో వివక్ష చూపుతున్నారని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంటీన్లో కొన్నిచోట్ల.. ఫర్ వెజిటేరియన్స్ ఓన్లీ అని సీట్లు రిజర్వ్ చేసి పెట్టారు. దీంతో నాన్ వెజిటేరియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీట్లు లేకుండా చేస్తున్నారని అంటున్నారు.

వెజిటేరియన్ వివాదం సోషల్ మీడియాలో కూడా రచ్చగా మారింది. వెజిటేరియన్స్ కి కేటాయించిన ప్రాంతంలో నాన్ వెజిటేరియన్స్ కూర్చుంటే మిగతా వాళ్లు గొడవ చేస్తున్నారు. వారిని అక్కడికి రానీయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో సమాచార హక్కు చట్టం కింద కొంతమంది విద్యార్థులు ఉన్నతాధికారుల్ని ప్రశ్నించారు. అలాంటి వివక్ష ఏదీ లేదని సమాధానం వచ్చింది. దీంతో నాన్ వెజిటేరియన్ విద్యార్థులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తమని అవమానిస్తున్నారంటూ నాన్ వెజిటేరియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీల్లో కూడా ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు.

First Published:  31 July 2023 4:10 AM GMT
Next Story