Telugu Global
National

ఇదీ అసలైన 'కేరళ స్టోరీ'

కేరళలోని అలప్పుజా నగరంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ హిందూ వధువు తల్లి తన కుమార్తె పెళ్లికి సహాయం కోసం మసీదు కమిటీని ఆశ్రయించింది. అక్కడి ముస్లింలు అందరూ ఏకమయ్యి ఆ హిందూ జంటకు మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం చేయడమే కాక పెళ్లి కుమార్తెకి 10 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ కానుకగా ఇచ్చారు.

ఇదీ అసలైన కేరళ స్టోరీ
X

'ది కేరళ స్టోరీ' మూవీపై దేశవ్యాప్తంగా వివాదం , పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఆ వీడియో పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కేరళలోని అలప్పుజా నగరంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ హిందూ వధువు తల్లి తన కుమార్తె పెళ్లికి సహాయం కోసం మసీదు కమిటీని ఆశ్రయించింది. అక్కడి ముస్లింలు అందరూ ఏకమయ్యి ఆ హిందూ జంటకు మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం చేయడమే కాక పెళ్లి కుమార్తెకి 10 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ కానుకగా ఇచ్చారు. ఈ పెళ్లి చూసేందుకు తరలివచ్చిన దాదాపు 1000 మందికిపైగా అతిథులకు వెజిటేరియన్ విందు ఏర్పాటు చేశారు.

.కేరళలోని అలప్పుజా నగరంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ హిందూ వధువు తల్లి తన కుమార్తె పెళ్లికి సహాయం కోసం మసీదు కమిటీని ఆశ్రయించింది. అక్కడి ముస్లింలు అందరూ ఏకమయ్యి ఆ హిందూ జంటకు మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం చేయడమే కాక పెళ్లి కుమార్తెకి 10 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ కానుకగా ఇచ్చారు.ఈ పెళ్లి జరిపిన ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. దేశంలో మతాల పేరుతో జరుగుతున్న హింసని ఆపాలనే మెసేజ్‌ని ఈ పెళ్లి ద్వారా ఇవ్వాలనుకున్నాం. అందుకే మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. అయితే ఇది ఈ మధ్యజరిగిన పెళ్ళి కాదు. 2020 లో జరిగింది. ఇప్పుడు రెహమాన్ ఈ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరో వైపు ఈ రోజు రిలీజైన‌ ''ది కేరళ స్టోరీ'' అనే మూవీ ద్వారా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని సంఘ్ పరివార్ , బీజేపీలు కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ వీడియో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.

First Published:  5 May 2023 12:43 PM GMT
Next Story