Telugu Global
National

బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు గడువు విధించాలి...రేపు ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

కాగా, ఈ వారం ప్రారంభంలో, తమిళనాడు అసెంబ్లీ ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఇలాంటి తీర్మానాలనే ఆమోదించాలని కోరుతూ స్టాలిన్ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు గడువు విధించాలి...రేపు ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
X

రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు గడువు విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ సోమవారం ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం ఆమోదించబోతోంది.ఇందుకోసం రేపు ఒక్క రోజు ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

ఇటువంటి తీర్మానాన్నే ఆమోదించిన తమిళనాడు అసెంబ్లీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో, తమిళనాడు అసెంబ్లీ ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఇలాంటి తీర్మానాలనే ఆమోదించాలని కోరుతూ స్టాలిన్ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేజ్రీవాల్ స్టాలిన్ కు తిరిగి లేఖ రాశారు. బిజెపియేతర ప్రభుత్వాలున్న చోట‌ గవర్నర్లు రాజ్యాంగ‌ విరుద్ధంగా, ప్రజల ఆదేశాన్ని అగౌరవపరుస్తూ బిల్లులను ఆమోదించకుండా నిరవధికంగా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.

బిల్లులను ఆమోదించడానికి గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం, భారత రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించినందుకు తమిళనాడు అసెంబ్లీని అభినందించిన ఆయన‌, “ఈ స్ఫూర్తితో, నేను ఢిల్లీ అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ప్రవేశపెడతాను. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించేందుకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్రాన్ని కోరుతాను.. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసే ఏ చర్యనైనా సమిష్టిగా ప్రతిఘటించాలి.” అని స్టాలిన్ కు రాసిన లేఖలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

First Published:  16 April 2023 8:12 AM GMT
Next Story