Telugu Global
National

అప‌ర దాన క‌ర్ణుడు శివ్ నాడార్...రోజుకు 3 కోట్ల రూపాయలు దానం

పారిశ్రామికవేత్త,హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ. 1,161 కోట్ల వార్షిక విరాళంతో 'భారతదేశం లో అత్యంత ఉదారుడుగా నిలిచారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ఈ విషయాన్ని ప్రకటించింది.

అప‌ర దాన క‌ర్ణుడు శివ్ నాడార్...రోజుకు 3 కోట్ల రూపాయలు దానం
X

దాతృత్వంలో తగ్గేదే లే అంటున్నారు ఐటీ టైకూన్ శివ్ నాడార్. సంపాదనలో ఎక్కువ భాగం దాతృత్వానికి ఖర్చు పెడుతూ సమాజంపై తనకు గల ప్రేమను మరోసారి నిరూపించారు.

పారిశ్రామికవేత్త,హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ. 1,161 కోట్ల వార్షిక విరాళంతో 'భారతదేశం లో అత్యంత ఉదారుడుగా నిలిచార‌ని ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 తెలిపింది. శివ్ నాడార్, ఆయన కుటుంబం రోజుకు రూ.3 కోట్లకు పైగా ప్రజలకు విరాళంగా అందిస్తున్నట్టు తెలిసింది.

'క్రియేటివ్ ఫిలాంత్రఫీ' అనే ఉద్దేశ్యంతో శివ్ నాడార్ ఫౌండేషన్ ను 1994లో ఏర్పాటు చేశారు. శివ్ నాడార్ కుటుంబం ఎక్కువగా దేశంలో విద్యావ్యాప్తికే కృషి చేస్తుంది. ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థలకి,విద్యా జ్ఞాన్, శివ్ నాడార్ యూనివర్సిటీ, శివ్ నాడార్ స్కూల్, శిక్షా ఇనీషియేటివ్, కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వంటి వాటికే శివ్ నాడార్ కంట్రిబ్యూషన్లు ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ వార్షిక విరాళం రూ.484 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్జీ తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

మూడు, నాల్గవ స్థానాలను వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఆక్రమించారు. అంబానీ ఒక సంవత్సరంలో రూ. 411 కోట్లు, బిర్లా అదే కాలంలో రూ. 242 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు.

ఇన్ఫోసిస్ నందన్ నిలేకని రూ.159 కోట్ల విరాళంతో 9వ స్థానం, క్రిస్ గోపాలకృష్ణన్ రూ.90 కోట్ల విత‌ర‌ణ‌తో 16 వ స్థానంలో ఎస్.డి.శిబులాల్ రూ.35 కోట్లు వితరణ చేసి 28వ స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది కొత్తగా 19 మంది ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ జాబితాలో చేరారు. వీరి విరాళాల విలువ రూ.832 కోట్లు. ఐఐటీ కాన్పూర్లోని మెడికల్ సైన్సెస్ అండ్ టెక్కు రూ.100 కోట్ల విరాళమిచ్చిన ఇండిగో కో-ప్రమోటర్ రాకేశ్ గాంగ్వాల్ సైతం తొలిసారి ఈ జాబితాలో చేరారు. ఈ ఏడాది ఆరుగురు మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రోహిణీ నిలేకని రూ.120 కోట్లు లీనా గాంధీ తివారీ రూ.21 కోట్లు అను అగా రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చార‌ని ఎడెల్గివ్ హురున్ తెలిపింది.

ఎడెల్‌గివ్ హురున్ ఇండియాలో తొమ్మిదవ వార్షిక ర్యాంకింగ్ జాబితా ప్ర‌క‌టించింది. రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల పేర్ల‌ను చేర్చింది. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారని ఆ సంస్థ తెలిపింది..

First Published:  21 Oct 2022 6:18 AM GMT
Next Story