Telugu Global
National

NDTV కి రవీష్ కుమార్ కూడా రాజీనామా చేశారు!

రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్న రవీష్ కుమార్ ప్రముఖ కార్యక్రమాలైన ‘ప్రైమ్ టైమ్ విత్ రవీష్ కుమార్’, ‘రవిష్ కి రిపోర్ట్’, ‘హమ్ లాగ్’, ‘దేశ్ కీ బాత్’కార్యక్రమాల‌కు హోస్ట్ గా ఉండేవారు.

NDTV కి రవీష్ కుమార్ కూడా రాజీనామా చేశారు!
X

సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ ఎన్‌డిటివి ఇండియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పదవికి రాజీనామా చేశారు.ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చిందని ఎన్డీటీవీ వర్గాలు తెలిపాయి.

రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్న రవీష్ కుమార్ ప్రముఖ కార్యక్రమాలైన 'ప్రైమ్ టైమ్ విత్ రవీష్ కుమార్', 'రవిష్ కి రిపోర్ట్', 'హమ్ లాగ్', 'దేశ్ కీ బాత్'కార్యక్రమాల‌కు హోస్ట్ గా ఉండేవారు.

NDTV ప్రమోటర్ గ్రూప్ RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ రాజీనామాలను కొత్త NDTV బోర్డు ఆమోదించిన ఒక రోజు తర్వాత రవీష్ రాజీనామా చేశారు.

బోర్డు సంజయ్ పుగాలియా, సెంథిల్ చెంగల్వరాయన్‌లను RRPRH బోర్డులో డైరెక్టర్లుగా నియమించింది.

NDTV ప్రమోటర్ సంస్థ RRPR హోల్డింగ్ సోమవారం తన ఈక్విటీ క్యాపిటల్‌లో 99.5 శాతం వాటాలను అదానీ గ్రూప్ యాజమాన్యంలోని విశ్వప్రధాన్ కమర్షియల్ (VCPL)కి బదిలీ చేసింది. తద్వారా NDTVని అదానీ గ్రూప్ అధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లయ్యింది.

First Published:  1 Dec 2022 3:12 AM GMT
Next Story