Telugu Global
National

రాహుల్ కొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫొటోలు

లండన్లో చాలామంది రాహుల్ గాంధీ ఫొటోలు తీసి వైరల్ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రాహుల్ కొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫొటోలు
X

భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ట్రెండింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో కూడా అదానీపై ప్రశ్నలు సంధించి మోదీని ఇరుకున పెట్టి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ సోషల్ మీడియాకి పని పెట్టారు. ప్రస్తుతం రాహుల్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన బ్రిటన్ పర్యటనకంటే, కొత్త గెటప్ పైనే ఎక్కువగా పోస్టింగ్ లు పెడుతున్నారు.

కొత్త లుక్ సూపర్..

భారత్ జోడో యాత్ర మొదలైనప్పటినుంచి పూర్తయ్యే వరకు షేవ్ చేసుకోకుండా అలాగే ఉన్నారు రాహుల్ గాంధీ. మీసం, గడ్డంతోపాటు.. జుత్తు కూడా పెంచుకున్నారు. ఇన్నాళ్లూ గుబురు గడ్డంతో కనిపించిన రాహుల్ గాంధీ తాజాగా బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. లండన్లో చాలామంది రాహుల్ గాంధీ ఫొటోలు తీసి వైరల్ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విదేశీ పర్యటనకోసం రాహుల్ కొత్త లుక్ లోకి మారిపోయారని, న్యూ లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెట్టారు.


‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ’.. అనే కాన్సెప్ట్ పై ఈరోజు కేంబ్రిడ్జ్ లో రాహుల్ ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగం కంటే కొత్త లుక్ పైనే చాలామంది ఫోకస్ పెట్టారు. రాహుల్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. బీజేపీ సానుభూతి పరులు మాత్రం సెటైర్లు మొదలు పెట్టారు. జోడో యాత్ర సారాంశాన్ని చెప్పడానికి కేంబ్రిడ్జ్ వెళ్లిన రాహుల్.. యాత్రలో పెంచుకున్న గడ్డం ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఈవెంట్ కోసం గడ్డం తీసేయాలా అని లాజిక్ తీస్తున్నారు.

First Published:  1 March 2023 6:50 AM GMT
Next Story