Telugu Global
National

మన ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుల వద్దకు వెళ్తాం...పోలీసుల ఇంట్లో జరిగితే బాబాల వద్దకు వెళ్తారు.

దొంగతనం చేసిన దొంగల గురించి పోలీసులు ఎంతవెతికినా ప్రయోజనం లేకపోయింది. ఏఎస్ఐ కృష్ణ కుమార్ కూడా చాలా ప్రయత్నం చేశాడు కానీ ఏమీ క్లూ దొరకలేదు. తమ శక్తి గురించి ఓ అంచనాకు వచ్చి, పోలీసులైతే దొంగను పట్టుకోలేరని భావించిన ఆ పోలీసు ఓ బాబాను ఆశ్రయించాడు.

మన ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుల వద్దకు వెళ్తాం...పోలీసుల ఇంట్లో జరిగితే బాబాల వద్దకు వెళ్తారు.
X

హర్యాణా పానిపట్ జిల్లా పోలీస్ లైన్‌లోని క్వార్టర్స్ లో నివాసముంటున్న కృష్ణ కుమార్ అనే ఏఎస్ఐ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఆయన తన స్వంత ఊరు వెళ్ళాడు. దొంగతనం వార్త విని ఆయన ఇంటికి చేరుకున్నాడు.

ఆయన వచ్చే సరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళిచూడగా 3.75 లక్షల నగదు, లాకెట్ సహా 10 తులాల బంగారు గొలుసు, 15 తులాల 3 కంకణాలు, 3 తులాల నెక్లెస్, 3 తులాల మంగళసూత్రం, 1 తులం బరువున్న చిన్నారి బంగారు గొలుసు, 1 తులాల గల్సరి, 12 బంగారు ఉంగరాలు, 8 తులాల బరువున్న కిట్టీ సెట్, 2 తులాల బరువున్న కిట్టీ సెట్, 4 తులాల బరువున్న 2 సెట్లు, 2 తులాల బరువున్న 1 చైన్ లాకెట్, 4 తులాల బరువున్న 5 జతల చెవిపోగులు, అర తులం బరువున్న బంగారు పాదరక్షలు అలాగే సుమారు కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని తేలింది.

ఈ దొంగతనం చేసిన దొంగల గురించి పోలీసులు ఎంతవెతికినా ప్రయోజనం లేకపోయింది. ఏఎస్ఐ కృష్ణ కుమార్ కూడా చాలా ప్రయత్నం చేశాడు కానీ ఏమీ క్లూ దొరకలేదు. తమ శక్తి గురించి ఓ అంచనాకు వచ్చి, పోలీసులైతే దొంగను పట్టుకోలేరని భావించిన ఆ పోలీసు ఓ బాబాను ఆశ్రయించాడు.

హర్యాణాలో చాలా పేరు గడించిన పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు ఆ పోలీసు అధికారి. దొంగనెలా గైనా పట్టివ్వాలని బాబాను వేడుకున్నాడు. బాబా కాళ్ళ దగ్గర పోలీసు అధికారి కూర్చొని మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆశ్రమంలో బాబా మరియు ASI మధ్య జరిగిన సంభాషణలోని ముఖ్యాంశాలు:

ASI- సార్ నా ఇంట్లో నెలల్లో 2 సార్లు చోరీ జరిగింది.

బాబా - దొంగతనం ఎప్పుడు జరిగింది?

ASI- మునుపటి తేదీ గుర్తులేదు కానీ ఇప్పుడు జరిగింది మాత్రం డిసెంబర్ 25 రాత్రి .

బాబా: చాలా వస్తువులు దొంగిలించబడ్డాయి. డబ్బు, బంగారం, వెండి సహా అన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి. 26వ తేదీ ఉదయం సమాచారం మీకు తెలిసింది.

ASI- అవును, అవును, నిజమే.

బాబా- ఇప్పుడు చెప్పు, నీకు ఏమి కావాలి?

ASI- సార్, నాకు దొంగ అడ్రస్ కావాలి.

బాబా- ఇప్పుడు దొంగ అడ్రస్ చెప్పమని పోలీసులు కోరుతున్నారు. వాళ్ళకిప్పుడు నా అవసరం వచ్చింది. నేను సహాయం చేస్తాను.

ASI - శక్తి కంటే గొప్పది ఏదీ లేదు.

బాబా‍ మీ ఇంట్లో దొంగతనం చేసిన‌ నేరస్థులు పంజాబ్ సరిహద్దుల్లో పట్టుబడతారు. కానీ, వస్తువులు రికవరీ అవుతాయా లేదా అనేది మాత్రం చెప్పలేను. ముందు ఒక నేరస్థుడు పట్టుబడతాడు, ఆ తర్వాత మిగతావాళ్ళంతా దొరికిపోతారు.

ASI - చాలా ధన్యవాదాలు.

బాబా- మీ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?

ASI- నేను జింద్ జిల్లాలోని నా స్వగ్రామం సివాకు వెళ్లాను.

బాబా- డిసెంబర్ 23న మీరు అబద్దపు కారణాలు చెప్పి సెలవుపై వెళ్లారు.

ASI- అవును, నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్న కారణంగా వెళ్ళల్సి వచ్చింది.

బాబా: ప్రభుత్వ క్వార్టర్స్‌లో దొంగతనం జరిగిందని బల్బీర్, అతని భార్య కవిత మీకు తెలియజేసారు. కవితే ఫోన్ చేసింది.

ASI- అవును సార్.

బాబా- మీరు మొదట 3 లక్షల 75 వేల రూపాయలు పోయాయని రిపోర్ట్ చేశారు, కానీ అది సరైనది కాదు. అంతకంటే ఎక్కువ పోయింది.

ASI- అవును సార్. నిజమే.

బాబా- మీ ప్రభుత్వ క్వార్టర్ నంబర్ 151లోనే క్లూ దాగి ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళు, అక్కడ మీకు క్లూ లభిస్తుంది. పంజాబ్ బోర్డర్ లో నేరస్థులు దొరికిపోతారు.

ASI- దొంగను మీరే కనుక్కోవాలి . అతని నెంబర్ చెప్పండి .

బాబా- త్వరలో పరిష్కారం లభిస్తుంది.

దొంగలనుపట్టుకోవడానికి కూడా నైపుణ్యంలేని, ఆధునిక పరిఙానాన్ని ఉపయోగించుకోలేని, కాడి జారవిడిచి బాబాలను ఆశ్ర‌యించే ఇటువంటి పోలీసులు ఇక ప్రజలను రక్షిస్తారని మనం అనుకోవడంలో అర్దం ఉందా ?

First Published:  1 Jan 2023 4:15 AM GMT
Next Story