Telugu Global
National

మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా కోరుకున్న బ్రాంచ్ ఇవ్వరు..

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ తొలి ఏడాదిలో అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు సాధిస్తే రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిని దక్కించుకునే అవకాశముంది. ఇలాంటి వారికోసం 10శాతం సీట్లు పక్కనపెడతారు.

మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా కోరుకున్న బ్రాంచ్ ఇవ్వరు..
X

ఎంట్రన్స్ పరీక్షల్లో ఎక్కువ మార్కులొచ్చిన వారికే కోరుకున్న బ్రాంచ్ తీసుకునే అవకాశముంటుంది. ఒకేళ మార్కులు తక్కువగా వచ్చినా డిమాండ్ ఉన్న బ్రాంచ్ కావాలంటే.. కాలేజీ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వారికి ఇప్పటి వరకూ స్లైడింగ్ అనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడిక ఆ ఆప్షన్ కూడా తీసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్ లో అడ్మిష్ తీసుకుంటారో.. ఆ తర్వాత కూడా అదే బ్రాంచ్ కంటిన్యూ చేయాలి. మధ్యలో బ్రాంచ్ మారాలంటే కుదరదు. ఫస్ట్ ఇయర్ లో టాప్ మార్క్ లు వచ్చినా కూడా బ్రాంచ్ మారేందుకు ఇకపై ఛాన్సే లేదు.

ఐఐటి, ఎన్ఐటీల్లో చేరిన విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ లో టాప్ మార్కులు తెచ్చుకుంటే సెకండ్ ఇయర్ నుంచి వారు కోరుకున్న బ్రాంచ్ లో చేరే అవకాశం ఉండేది. అయితే ఈ కండిషన్ తో చాలామంది డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచ్ కోసం ఫస్ట్ ఇయర్ లో బాగా కష్టపడేవారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. ఆ ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలను నివారించడానికే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్‌ తొలి ఏడాది పూర్తయ్యాక మెరిట్‌ ప్రాతిపదికన రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిలోకి మారే వెసులుబాటును రద్దు చేయాలని ఐఐటీ, ఎన్‌ఐటీలను ఆదేశించింది కేంద్రం.

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ తొలి ఏడాదిలో అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు సాధిస్తే రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిని దక్కించుకునే అవకాశముంది. ఇలాంటి వారికోసం 10శాతం సీట్లు పక్కనపెడతారు. కానీ ఇకపై ఇలాంటి ఛాన్స్ లేదు. ఐఐటీ, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్ వంటి డిమాండ్ ఉన్న బ్రాంచ్ లో సీటు రాకపోయినా.. ఏదో ఒక బ్రాంచ్ లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుని, మంచి మార్కులు తెచ్చుకుని సెకండ్ ఇయర్ లో తాము కోరుకున్న బ్రాంచ్ కి వెళ్లిపోతుంటారు స్టూడెంట్స్. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలాంటి వారికి ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం పడుతోందని తెలుస్తోంది.

First Published:  14 May 2023 9:14 AM GMT
Next Story