Telugu Global
National

బీజేపీ మద్దతుతోనే మ‌ణిపూర్ లో దాడులు... సుప్రీం కోర్టు లో ఆదివాసీ సంఘాల పిటిషన్

మణిపూర్ లో గిరిజనులపై బీజేపీ సంపూర్ణ మద్దతుతోనే దాడులు జరుగుతున్నాయని మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మణిపూర్ లో ఆధిపత్య సమూహమైన మైతేయీలకు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఇస్తోందని ట్రైబల్ ఫోరమ్ తన పిటిషన్ లో పేర్కొంది.

బీజేపీ మద్దతుతోనే మ‌ణిపూర్ లో దాడులు... సుప్రీం కోర్టు లో ఆదివాసీ సంఘాల పిటిషన్
X

మణిపూర్ లో నాలుగు రోజులుగా సాగుతున్న హింస ఆగడంలేదు. ఆదివాసులకు, మైతేయీ కమ్యూనిటీకి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా మరణించినట్టు అనధికార వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఈ రెండు వర్గాల విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

బ్రాహ్మణులైన మైతేయీలను ఎస్టీల్లో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వివిధ ఎస్టీ వర్గాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమపై బీజేపీ మద్దతుతోనే దాడులు జరుగుతున్నాయని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మణిపూర్ లో గిరిజనులపై బీజేపీ సంపూర్ణ మద్దతుతోనే దాడులు జరుగుతున్నాయని మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మణిపూర్ లో ఆధిపత్య సమూహమైన మైతేయీలకు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఇస్తోందని ట్రైబల్ ఫోరమ్ తన పిటిషన్ లో పేర్కొంది.

భారత రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా లౌకికత్వానికి నీళ్ళొదిలిన బీజేపీ తమపై దాడులకు తెగబడిందని ట్రైబల్ ఫోరం మండిపడింది. ఈ విషయాన్నే ట్రైబల్ ఫోరమ్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది.

First Published:  7 May 2023 1:31 PM GMT
Next Story