Telugu Global
National

ఇండియాలో సేఫెస్ట్ సిటీ కోల్‌కతా.. హైదరాబాద్‌ ర్యాంక్ ఎంతంటే.!

ఐపీసీ, ప్రత్యేక, స్థానిక చట్టాల సెక్షల కింద నమోదైన కేసులను మాత్రమే NCRB పరిగణలోకి తీసుకుంది. 2020, 2021లోనూ కోల్‌కతా ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులోనే నిలిచింది.

ఇండియాలో సేఫెస్ట్ సిటీ కోల్‌కతా.. హైదరాబాద్‌ ర్యాంక్ ఎంతంటే.!
X

దేశంలోనే అత్యంత సురక్షితమైన సిటీగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను సొంతం చేసుకుంది. ప్రతి లక్ష జనాభాకు తక్కువ నేరాలను నమోదు చేసిన నగరాల్లో కోల్‌కతా టాప్‌లో నిలిచింది. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో - NCRB ఓ నివేదికను రిలీజ్ చేసింది.

2022లో కోల్‌కతాలో ప్రతి లక్ష మందిలో 86.5 కేసులు నమోదయ్యాయి. ఇక NCRB రిలీజ్‌ చేసిన ఈ జాబితాలో పుణే, హైదరాబాద్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పుణేలో ప్రతి లక్ష మంది జనాభాకు 280.7 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లో 299.2 కేసులు నమోదైనట్లు NCRB డేటా వెల్లడించింది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నేరాలను పరిగణలోకి తీసుకుని ఈ రిపోర్టును విడుదల చేశారు.

ఐపీసీ, ప్రత్యేక, స్థానిక చట్టాల సెక్షల కింద నమోదైన కేసులను మాత్రమే NCRB పరిగణలోకి తీసుకుంది. 2020, 2021లోనూ కోల్‌కతా ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులోనే నిలిచింది. 2021లో కోల్‌కతాలో ప్రతి లక్ష జనాభాకు 103.4 గుర్తించదగిన కేసులు నమోదు కాగా.. 2020లో 129.5 కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 2021లో 259.9 కేసులు నమోదు కాగా.. పుణేలో 256.8 కేసులు నమోదయ్యాయి.

First Published:  5 Dec 2023 10:24 AM GMT
Next Story