Telugu Global
National

చావనైనా చస్తాగానీ బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను: బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌

"జాగ్రత్తగా వినండి. గతంలో నన్ను దగ్గరికి తీయడానికి తేజస్వి, అతని తండ్రిపై కేసులు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వారు అవే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యక్తులు ఎప్పుడూ అలాంటి పనులు చేస్తూనే ఉంటారు" అని నితీష్ కుమార్ అన్నారు.

చావనైనా చస్తాగానీ బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను: బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌
X

మళ్ళీ బీజేపీతో పొత్తుపెట్టుకోవడంకన్నా చనిపోవడం మంచిదని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అన్నారు. ఆర్జేడీ నేత , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై ఉద్దేశపూర్వకంగా, ఏ ఆధారం లేకుండా బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు.

మరోసారి బీజేపీతో జేడీయూ కలయిక ఊహాగానాలపై జర్నలిస్టుల అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ,

" ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారితో జతకట్టడం కంటే నేను చనిపోవడమే మేలు" అని నితీశ్ కుమార్ అన్నారు.

"జాగ్రత్తగా వినండి. గతంలో నన్ను దగ్గరికి తీయడానికి తేజస్వి, అతని తండ్రిపై కేసులు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వారు అవే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యక్తులు ఎప్పుడూ అలాంటి పనులు చేస్తూనే ఉంటారు" అని నితీష్ కుమార్ అన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు గాను 36 స్థానాలు గెలుస్తామని బీజేపీ ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. బిజెపి హిందుత్వ భావజాలం పట్ల ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే ముస్లింల ఓట్లు, తన ఇతర‌ మద్దతుదారులందరి ఓట్లను తాము మిత్రపక్షంగా ఉన్నందువల్లే బీజేపీకి లభించాయన్న విషయం ఆ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు.

''జనాదరణ లేని ముఖ్యమంత్రితో మళ్లీ పొత్తు ప్రశ్నే లేదు" అని బిజెపి నాయకులు వ్యాఖ్యానించిన తర్వాత నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"అటువంటి పొత్తులపై మా పార్టీ క్యాడర్‌లో ఉన్న‌ పుకార్లను తొలగించడానికి మేము ప్రయత్నించాము. వాస్తవానికి, సిఎంకు ఊగిసలాడే ప్రవృత్తి ఉంది. కానీ మేము అతనిచే మళ్లీ మోసపోము" అని బిజెపి బీహార్ చీఫ్ సంజయ్ జైస్వాల్ అంతకు ముందు అన్నారు. .

First Published:  30 Jan 2023 9:59 AM GMT
Next Story