Telugu Global
National

వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి.. లాక్కెళ్లిపోయిన ఈడీ

ఈడీ అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కారులోనే కుప్పకూలారు. వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి.. లాక్కెళ్లిపోయిన ఈడీ
X

తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపాయి. కేవలం సోదాలు జరిపి వెళ్లిపోతారనుకుంటున్న సమయంలో నేరుగా మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాలిప్పించే క్రమంలో అభ్యర్థుల వద్ద ఆయన డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలను సెంథిల్ బాలాజీ ఖండించారు. కావాలనే తనని కుట్రలో ఇరికించారని అంటున్నారు. ఈడీ అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కారులోనే కుప్పకూలారు. వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ముమ్మర తనిఖీలు..

తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీతో పాటు మరింత కొంతమంది ఇళ్లు, ఆఫీసుల్లో మంగళవారం ఈడీ సోదాలు జరిపింది. మనీ లాండరింగ్‌ కేసులో చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో ఈడీ దాడులు చేపట్టింది. ఈరోడ్‌ లోని తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లారీ కాంట్రాక్టర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. గత నెలలో బాలాజీ సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పుటి దాడుల అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఈడీ అరెస్ట్ తో కలకలం..

ఈడీ సోదాలు రాజకీయ కక్షసాధింపు అంటున్న క్రమంలో నేరుగా రాష్ట్రమంత్రిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణకు గత నెలలో సుప్రీంకోర్టు ఈడీకి అనుమతులివ్వగా.. సచివాలయంలో కూడా సోదాలు జరపడం, ఇప్పుడు మంత్రి అరెస్ట్ కలకలం రేపింది. తమిళనాడు వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.

First Published:  14 Jun 2023 1:55 AM GMT
Next Story