Telugu Global
National

కోవిడ్ ఒక వ్యాధి, దానిని రాజకీయ సాకుగా మార్చవద్దు : క‌న్హ‌య్య‌కుమార్

ఢిల్లీలో గ‌డ్డ‌క‌ట్టించే చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో కూడా రాహుల్ టీ ష‌ర్ట్ లో న‌డ‌వ‌గ‌లుగుతున్నారని కన్హయ కుమార్ అన్నారు. ఆయ‌న‌పైన‌, కాంగ్రెస్ పైన బిజెపి చేస్తున్న ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న శ‌రీరం అన్ని వాతావ‌ర‌ణాల‌కీ అతీతంగా మారింద‌ని అన్నారు.దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం లేకుండా ఉండాలంటే మనమందరం కలిసి మెలిసి జీవించాలనేదే యాత్ర సందేశమని, మన హృదయాల్లోనూ, దేశంలోనూ ప్రేమ ఉండాలనే ఆకాంక్ష‌తోనే ఈ యాత్ర నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు.

కోవిడ్ ఒక వ్యాధి, దానిని రాజకీయ సాకుగా మార్చవద్దు : క‌న్హ‌య్య‌కుమార్
X

బిజెపి చేస్తున్న ద్వేష‌పూరిత దాడుల‌ను భ‌రించిన రాహుల్ గాంధీ రాటుదేలార‌ని, అందుకే వాటికి విరుగుడుగా ప్రేమ సామ‌ర‌స్యం స‌మ‌త మ‌మ‌త ను ప్రోత్స‌హించేందుకు భార‌త్ జోడో యాత్ర‌నిర్వ‌హిస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు క‌న్హ‌య్య‌కుమార్ చెప్పారు. రాహుల్ గాంధీతో పాటు ఆయ‌న యాత్ర‌లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే.

కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన విజ్ఞప్తుల మధ్య రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర శ‌నివారంనాడు ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్ నుండి ఢిల్లీలో ప్రవేశించింది. రాహుల్ గాంధీ హాఫ్ స్లీవ్ వైట్ టీ-షర్ట్‌లో శీతాకాలపు బట్టలు లేకుండా నడుచుకుంటూ కనిపించారు. దీనిపై క‌న్న‌య్య కుమార్ స్పందిస్తూ.. ఢిల్లీలో గ‌డ్డ‌క‌ట్టించే చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో కూడా రాహుల్ టీ ష‌ర్ట్ లో న‌డ‌వ‌గ‌లుగుతున్నార‌న్నారు. ఆయ‌న‌పైన‌, కాంగ్రెస్ పైన బిజెపి చేస్తున్న ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న శ‌రీరం అన్ని వాతావ‌ర‌ణాల‌కీ అతీతంగా మారింద‌ని అన్నారు.

దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం లేకుండా ఉండాలంటే మనమందరం కలిసి మెలిసి జీవించాలనేదే యాత్ర సందేశమని, మన హృదయాల్లోనూ, దేశంలోనూ ప్రేమ ఉండాలనే ఆకాంక్ష‌తోనే ఈ యాత్ర నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు.

దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం లేకుండా ఉండాలంటే మనమందరం కలిసి మెలిసి జీవించాలనేదే యాత్ర సందేశమని, మన హృదయాల్లోనూ, దేశంలోనూ ప్రేమ ఉండాలనే ఆకాంతోనే ఈ యాత్ర నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు. .

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేష్, పవన్ ఖేరా, భూపీందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, మరియు రణదీప్ సూర్జేవాలా సహా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. కొంతమంది స్వాతంత్య్ర‌ సమరయోధుల కుటుంబాలతో పాటు నేడు పాల్గొన్నారు.

" యాత్రను తేలిగ్గా తీసుకోవాల‌ని మొద‌ట బిజెపి భావించింది. ఈ యాత్ర యొక్క పరిధి సామాజిక, రాజకీయ, ఆర్థిక, మతాల‌కు అతీతంగా సద్భావనా సందేశంతో జ‌రుగుతున్నందున ప్రజల నుంచి విశేష ఆద‌ర‌ణ రావ‌డం చూసి బిజెపి ఏమీ చేయలేకపోతోంది. కార్మికులు, యువత, రైతులు సమాజంలోని అన్ని వర్గాలను ఈ భార‌త్ జోడో యాత్ర ఎంతో ఆకర్షించింది, " అని కన్హయ్య కుమార్ అన్నారు,

దీంతో బిజెపి తన "పాత డర్టీ ట్రిక్స్" మొదలుపెట్టింది. యాత్రపై అపవాదులు ప్రారంభించింది అని కుమార్ అన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌లపై, కేంద్రం ఒకసారి జారీ చేసిన అన్ని శాస్త్రీయ మార్గదర్శకాలను యాత్ర అనుసరిస్తుందని ఆయన పార్టీ లైన్‌ను పునరుద్ఘాటించారు. "కోవిడ్ ఒక వ్యాధి, ఒక సాకు కాదు. దానిని రాజకీయ సాకుగా మార్చవద్దు" అని ఆయన అన్నారు.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లనున్నందున యాత్రకు విరామం ఇస్తున్నారని బీజేపీ నేతల ఆరోపణలను ఆయ‌న ఖండించారు. వాహనాలు ఇప్పుడు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నందున వాటిని సర్వీసింగ్ చేయడానికి విరామం అవసరమని క‌న్హ‌య్య కుమార్ పేర్కొన్నారు.

పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద జోషి చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌పై జైరాం రమేష్‌ సవాల్‌ను కుమార్ ప్రస్తావించారు. విదేశాల్లో వేడుక‌లు జ‌రుపుకునేందుకే రాహుల్ య‌త్ర‌కు విరామం ఇస్తున్నార‌న్న మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోప‌ణ‌ల‌పై జైరాం ర‌మేష్ దీటుగా స్పందించారు. అలా చేస్తే తాము క్ష‌మాప‌ణ చెబుతామ‌ని , అలా కాక‌పోతే జోషి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు.

First Published:  24 Dec 2022 1:51 PM GMT
Next Story