Telugu Global
National

చాందినీచౌక్ టు పార్ల‌మెంట్‌.. అక్ష‌య్ కోసం బీజేపీ స్క్రిప్ట్‌!

చాందినీచౌక్ టు పార్ల‌మెంట్‌.. అక్ష‌య్ కోసం బీజేపీ స్క్రిప్ట్‌!
X

గ‌త రెండు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి గెలుపు కోసం చెమ‌టోడ్చాల్సి వ‌చ్చేలా ఉంది. ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్‌తో కాంగ్రెస్ జ‌త క‌ట్టిన నేప‌థ్యంలో గెలుపు అంత ఈజీ కాద‌ని క‌మ‌ల‌నాథులు గుర్తించారు. అందుకే ఈసారి ఢిల్లీలో ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఏడు సీట్ల‌లో ఒక‌టైన చాందినీచౌక్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్‌ను బ‌రిలోకి దించేందుకు బీజేపీ నేత‌లు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

చాందినీచౌక్‌లో స్థానికుడ‌న్న పేరు

బాలీవుడ్ హీరో కాక‌ముందు మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుని త‌ర్వాత వెయిట‌ర్‌గా, చెఫ్‌గా హోట‌ల్లో ప‌ని చేసిన అక్ష‌య్ ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో చాలాకాలం నివాసం ఉన్నారు. 24 మంది స‌భ్యులున్న మా కుటుంబం చాందినీచౌక్‌లో ఓ చిన్న ఇంట్లో నివాసం ఉన్నాం అని అక్షయ్ చాలాసార్లు చెప్పారు. ఆయ‌న బాల్య‌మంతా ఎక్కువ అక్క‌డే గ‌డిచింది.

సినిమా కూడా కాదు

చాందినీచౌక్ టు చైనా అని అక్ష‌య్ హీరోగా ఓ సినిమా కూడా వ‌చ్చింది. ఒక‌ప్ప‌టి స్థానికుడిగా ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని బీజేపీ ప్లాన్ అని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో చాందినీచౌక్‌లో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను కాద‌ని అక్ష‌య్ కుమార్‌ను బ‌రిలోకి దింపాల‌ని బీజేపీ నేత‌లు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోందని ఓ ప్ర‌ముఖ హిందీ ప‌త్రిక ఈ మేర‌కు క‌థ‌నం ప్రచురించింది. అక్ష‌య్ కుమార్ బీజేపీ హిందూత్వ ఎజెండాను బ‌ల‌ప‌రిచేలా సినిమాలు తీస్తుంటార‌ని కూడా ప్ర‌చారం ఉంది. దీన్ని అక్ష‌య్ ఖండించారు అనుకోండి అది వేరే విష‌యం!

First Published:  27 Feb 2024 10:47 AM GMT
Next Story