Telugu Global
National

Pathaan Movie: కాషాయ బికినీకి సెన్సార్ కట్

Pathaan movie censor: చిత్రయూనిట్ రీ షూట్ కి అంగీకరించకపోవడంతో దీపిక కాషాయ బికినీలో ఉన్న మూడు క్లోజప్ షాట్స్, కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ ని కట్ చేశారు. సినిమా మొత్తం 10కి పైగా కట్స్ ఉన్నాయ.

Pathaan Movie: కాషాయ బికినీకి సెన్సార్ కట్
X

కాషాయ వస్త్రాలు కప్పుకుని పాపాలు, పాడు పనులు చేసేవారు పెద్దమనుషులుగానే చలామణి అవుతున్నారు. కానీ కాషాయం రంగు బికినీ ధరించడం, ఆ బికినీ సీన్లు సినిమాల్లో చూపించడమే ఇప్పుడు తప్పయిపోయింది. ఇటీవల పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్-దీపికా పదుకోన్ పైన చిత్రీకరించిన బేషరమ్ పాట కాషాయ దుస్తుల వల్లే వివాదాస్పదమైంది. ఇప్పుడా పాటను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. ఆ పాట మొత్తాన్ని తీసేస్తే అదో కొత్త వివాదం అవుతుంది కాబట్టి, కాషాయ బికినీలో చిత్రీకరించిన సన్నివేశాల్ని మాత్రం తొలగించారు. మరి కాషాయ బికినీలో ఉన్న అసభ్యత, మిగతా రంగుల బికినీల్లో ఎందుకు లేదో సెన్సార్ బోర్డ్ కే తెలియాలి.


టాక్ ఆఫ్ ది నేషన్ గా బేషరమ్..

పఠాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన బేషరమ్ సాంగ్ లో దీపికా పదుకోన్ కాషాయ బికినీ ధరించడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. సినిమా సెన్సార్ కి వెళ్లాక ఈ ప్రభావం స్పష్టంగా కనపడింది. సెన్సార్ బోర్డ్ ముందుగానే హెచ్చరించింది, దానికి ప్రత్యామ్నాయం చూడాలని చెప్పింది. కానీ చిత్రయూనిట్ రీ షూట్ కి అంగీకరించకపోవడంతో దీపిక కాషాయ బికినీలో ఉన్న మూడు క్లోజప్ షాట్స్, కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ ని కట్ చేశారు. సినిమా మొత్తం 10కి పైగా కట్స్ ఉన్నాయ.

దేశభక్తి చిత్రంగా రూపొందిన పఠాన్.. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. షారుఖ్ ఖాన్ ఇందులో హీరో. విలన్ గా జాన్ అబ్రహాం నటించారు. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. రన్‌ టైమ్‌ 146.16 నిమిషాలు (2గంటల 26 నిమిషాల 16 సెకన్లు)గా ఫిక్స్ చేసింది. డైలాగ్స్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.

First Published:  18 Jan 2023 1:54 AM GMT
Next Story