Telugu Global
National

ఆనంద్ మహీంద్రా ఫిదా.. 13ఏళ్ల బాలికకు బంపర్ ఆఫర్

ఆ చిన్నారి వాయిస్ పసిగట్టిన అలెక్సా కుక్కలా అరవడంతో కోతులు భయంతో పారిపోయాయి. ఇలా ఆ బాలిక, తనను ఆ చిన్నారిని రక్షించి ఔరా అనిపించుకుంది.

ఆనంద్ మహీంద్రా ఫిదా.. 13ఏళ్ల బాలికకు బంపర్ ఆఫర్
X

ఓ ధైర్యవంతురాలైన బాలిక చేసిన పనికి మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తన కంపెనీలో జాబ్ ఇస్తున్నట్లు బంప‌ర్‌ ఆఫర్ ఇచ్చారు. మ్యాటర్‌లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన 13ఏళ్ల బాలిక తన బంధువైన 15 నెలల చిన్నారితో ఓ గదిలో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించి నానా రచ్చ చేశాయి. కానీ, బాలిక భయపడకుండా తనను, చిన్నారిని రక్షించుకునేందుకు తెలివిగా వ్యవహరించింది. ఇంట్లోకి వచ్చిన కోతుల గుంపును తరిమి కొట్టేందుకు 'అలెక్సా'ను కుక్కలా మొరగమని సూచించింది. దీంతో ఆ చిన్నారి వాయిస్ పసిగట్టిన అలెక్సా కుక్కలా అరవడంతో కోతులు భయంతో పారిపోయాయి. ఇలా ఆ బాలిక, తనను ఆ చిన్నారిని రక్షించి ఔరా అనిపించుకుంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇది తెలిసిన ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనం బానిసలుగా మారతామా లేదా మాస్టర్స్ అవుతామా అనేది ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రశ్న. కానీ ఈ బాలికను చూస్తుంటే మనం టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలమో మరోసారి స్పష్టమైంది. ఈ బాలిక ధైర్యం, తెలివికి నేను ఫిదా అయ్యాను. ఆమె చదువు పూర్తి అయ్యాక, ఎప్పుడైనా వచ్చి కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే, మా కంపెనీలో జాబ్ ఇచ్చేందుకు మేం రెడీ" అంటూ బాలికకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.

First Published:  7 April 2024 10:00 AM GMT
Next Story