Telugu Global
National

కర్నాటకలో మంకీ ఫీవర్‌.. ఇద్దరు మృతి

మంకీ ఫీవర్‌ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని రణ్‌దీప్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు.

కర్నాటకలో మంకీ ఫీవర్‌.. ఇద్దరు మృతి
X

కర్నాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో 18 సంవత్సరాల యువతి, 79 సంవత్సరాల వృద్ధుడు ఉన్నారు. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌ దీప్‌ ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి, ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు.

ఇవి కాకుండా ఇంకా ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో 3 కేసులు నమోదైనట్టు రణ్‌దీప్‌ వెల్లడించారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా, అందులో 48 మందికి మంకీ ఫీవర్‌ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.

మంకీ ఫీవర్‌ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని రణ్‌దీప్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యాధికి ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

First Published:  5 Feb 2024 3:25 AM GMT
Next Story