Telugu Global
International

సైబర్ ప్రపంచం: రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాక్

ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త వెబ్ సైట్లు పుడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయని అంచనా.

సైబర్ ప్రపంచం: రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాక్
X

అడపా దడపా మనకి తెలిసిన వెబ్ సైట్లు అప్పుడప్పుడు హ్యాకింగ్ కి గురవుతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా అలాంటి హ్యాకింగ్ లు రోజుకి 70వేలు జరుగుతాయంటే ఎవరైనా నమ్మగలరా..? అవును రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతుంటాయని ఇంగ్లండ్‌ కు చెందిన ఇంటర్నెట్‌ సంస్థ నెట్‌ క్రాఫ్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

నిమిషానికి 175 పుడుతున్నాయి..

ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త వెబ్ సైట్లు పుడుతున్నాయి. అంటే కొత్త డొమైన్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనమాట. వీటిలో ఎన్ని పూర్తి స్థాయిలో వెబ్ సైట్స్ గా రూపు దిద్దుకుంటాయనేది ప్రశ్నార్థకమే. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయని అంచనా. వాటిలో కేవలం 18 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. అంటే 2029 కోట్ల వెబ్ సైట్లు మాత్రమే ప్రస్తుతం తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 1991లో ఒక్క వెబ్ సైట్ తో ప్రారంభమైన ఇంటర్నెట్.. ఇప్పుడు 100కోట్లకు పైగా వెబ్ సైట్లకు వేదికగా మారింది.

వెబ్ వ్యాపారం..

దాదాపు 71 శాతం మంది తమ వ్యాపారాలను వెబ్‌ సైట్లపై ఆధారపడి నిర్వహిస్తున్నారు. ఇందులో 28 శాతం ఆన్‌ లైన్‌ వ్యాపారం నడుస్తోంది. రోజుకి 200 కోట్ల మందికి పైగా కస్టమర్లు వివిధ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు.

బ్రౌజింగ్ లో గూగుల్ దే టాప్..

తెలియని విషయాలు తెలుసుకోవాలనే తపన ఉన్నవారు వెంటనే గూగుల్ ని ఓపెన్ చేస్తున్నారని నెట్ క్రాఫ్ సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ వెబ్‌ ట్రాఫిక్‌ లో 93 శాతం గూగుల్‌ నుంచే వస్తోంది. ఇంటర్నెట్ వినియోగించేవారు సగటున 22 నిమిషాలు గూగుల్ కోసం కేటాయిస్తారు. యూట్యూబ్‌ విషయానికొస్తే ఇది కేవలం 9 నిమిషాలు మాత్రమే. ఒక రోజులో దాదాపు 300 కోట్ల కంటే ఎక్కువ గూగుల్ సెర్చ్ లు రికార్డ్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ.. 400 కోట్ల గిగాబైట్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ ట్రాఫిక్ నమోదవుతోంది.

First Published:  10 April 2023 9:21 AM GMT
Next Story