Telugu Global
International

అమెరికాతో చేసుకున్న అణ్వాయుధ పరిమితి ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్ తో యుద్దానికి ఏడాది కావస్తున్న సందర్భంగా పార్లమెంటులో పుతిన్ మాట్లాడుతూ, “అమెరికాతో రష్యా వ్యూహాత్మ క అణ్వాయుధాల ఒప్పందంలో తమ‌ భాగస్వామ్యా న్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తప్పని సరి పరిస్థితుల్లో నేను ఈరోజు ప్రకటించవలసి వస్తున్నది.” అని అన్నారు.

అమెరికాతో చేసుకున్న అణ్వాయుధ పరిమితి ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన రష్యా
X

అణ్వాయుధ వినియోగం పై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యం తో చేసుకున్న ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటిస్తున్న వేళ పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉక్రెయిన్ తో యుద్దానికి ఏడాది కావస్తున్న సందర్భంగా పార్లమెంటులో పుతిన్ మాట్లాడుతూ, “అమెరికాతో రష్యా వ్యూహాత్మ క అణ్వాయుధాల ఒప్పందంలో తమ‌ భాగస్వామ్యా న్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తప్పని సరి పరిస్థితుల్లో నేను ఈరోజు ప్రకటించవలసి వస్తున్నది.” అని అన్నారు.

ఉక్రెయిన్‌లో రష్యా ను ఓడించాలన్న లక్ష్యాన్ని అమెరికా, నాటో దేశాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నా యని, వ్యూహాత్మకంగా మమ్మల్ని ఓడించి.. మా అణు కేం ద్రాలను స్వాధీనం చేసుకోవడానికి వారు

ప్రయత్నిస్తున్నా రని పుతిన్ ఆరోపించారు. తమ‌ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేసేందుకు నాటో దేశాలు సాయం చేస్తున్నాయని ఆయన ప్రసంగంలో తెలిపారు. అమెరికా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తాము అణ్వాయుధ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ హెచ్చరించారు.

నిపుణులచెప్తున్న దాని ప్రకారం ..రష్యా , అమెరికాల‌ వద్ద ప్రపంచంలోని 90శాతం అణు వార్‌హెడ్లున్నాయి. ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశ‌నం చేయగలవని నిపుణుల అభిప్రాయం. 2010 లో ఇరు దేశాల మధ్య అణ్వాయుదాల తయారీపై పరిమితి విధిస్తూ న్యూ స్టార్ట్ పేరుతో ఒక ఒప్పందంజరిగింది. ఈ ఒప్పందం ప్రకారం .. ఇరు దేశాలు 1550 కం టే ఎక్కువ న్యూ క్లియర్‌ వార్‌హెడ్‌లు, 700 కంటే

ఎక్కు వ క్షిపణులు, బాంబర్లను మోహరించకూడదు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు పరస్పరం తనిఖీలు చేసుకుంటాయి.

అయితే ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిల్చిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. ఒక వేళ ఈ ఒప్పందం రద్దయ్యి ఇరు దేశాలు తమ అణ్వాయుధాలను మితిమీరి పెంచుకుంటే ప్రపంచానికి తీవ్ర వినాశ‌నం తప్పదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

First Published:  21 Feb 2023 3:12 PM GMT
Next Story