Telugu Global
International

ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష.. త‌గ్గిన శిక్ష‌

ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష.. త‌గ్గిన శిక్ష‌
X

పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి జైలు జీవితం నుంచి కాస్త ఊరట ల‌భించింది. మ‌య‌న్మార్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా దాదాపు ఏడు వేల మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష క‌ల్పిస్తున్న‌ట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే సూకీకి ఆరేళ్లు, మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ కు నాలుగేళ్లు జైలు శిక్ష తగ్గనుంది.

1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆంగ్ సాన్ సూకీని తొలిసారిగా గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే 1991లో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెను నోబెల్ బహుమతి వరించింది. 2010లో ఆమెకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఇక 2015, 2020లో జరిగిన మయన్మార్‌ ఎన్నికలలో ఆమె పార్టీ విజయం సాధించింది. అయితే 2021లో సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి బాధ్యతలు చేపట్టిన సైన్యం.. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని అనే నెపంతో ఆమెను, ఆమె అనుచరులను జైలుకి పంపింది.

మొత్తం సూకీపై 19కి పైగా కేసులు ఉండటంతో ఆమెకు కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్ష‌మాభిక్ష‌ ప్రకటనతో వీటిలో ఐదు కేసులను కొట్టేశారు. దీనితో ఆమెకు ఆరేళ్ల‌ శిక్ష తగ్గింది. ఈ ప్రకటనకు ముందుగానే సోమవారం నాడు ఆమెను ప్రభుత్వ బిల్డింగ్ కు మార్చినట్టు సమాచారం. ఆమెను విడుదల చేయాలన్న అంతర్జాతీయ ఒత్తిడులతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

First Published:  1 Aug 2023 11:17 AM GMT
Next Story