Telugu Global
International

మేడిన్ ఇండియా ఐఫోన్‌.. చౌక‌గా కావాలంటే ఛ‌లో దుబాయ్!

దుబాయ్‌కి ఫ్లైట్‌లో వెళ్లి ఐఫోన్ 15 కొని తెచ్చుకున్నా ఆ టికెట్ రేటు క‌లిపినా కూడా అది ఇండియాలో ఐఫోన్ 15 కంటే ధ‌ర త‌క్కువే.

మేడిన్ ఇండియా ఐఫోన్‌.. చౌక‌గా కావాలంటే ఛ‌లో దుబాయ్!
X

మ‌న ఊళ్లో త‌యారైన వ‌స్తువు మ‌న‌కు కాస్త త‌క్కువ ధ‌ర‌లో దొరుకుతుంది. ఎందుకంటే వ‌స్తువు త‌యార‌య్యాక ర‌వాణా ఖ‌ర్చు ఉండ‌దు కాబ‌ట్టి. ఇది చాలా సింపుల్ లాజిక్‌. అదే లాజిక్‌తో ఐఫోన్ ఇండియాలో త‌యార‌వుతుంద‌న‌గానే చాలా మంది మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లోనే ఐఫోన్ దొరుకుతుంద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. తీరా చూస్తే ఇప్పుడు ఐఫోన్ 15 రేట్లు మ‌న‌కంటే దుబాయ్‌లో చాలా తక్కువ ఉండ‌టం చూసి అవాక్క‌వుతున్నారు.

ఐఫోన్ 15 దుబాయ్‌లో చౌక‌

ఐఫోన్ 15 బేసిక్ మోడ‌ల్‌ ధ‌ర ఇండియాలో రూ.79,900. దుబాయిలో రూ.76,817. ఐఫోన్ 15 ప్ల‌స్ ధ‌ర ఇండియాలో 89,900.. అదే దుబాయిలో 85,857. ఐఫోన్ 15 ప్రో ధ‌ర మ‌న ద‌గ్గ‌ర 1,34,900. దుబాయ్‌లో 97,157. ఐఫోన్‌15 ప్రో మ్యాక్స్ కాస్ట్ ఇండియాలో 1,59,900 కానీ, అదే ఫోన్‌ను దుబాయిలో 1,15,237కి కొనుక్కోవ‌చ్చు.

ఫ్లైట్ టికెట్ రేట్లు క‌లిపినా కూడా అక్క‌డే త‌క్కువ‌!

ప్రో, ప్రో మ్యాక్స్ మోడ‌ళ్ల‌లో ఇండియా కంటే దుబాయ్ ధ‌ర 35వేల నుంచి 40 వేల వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంది. అందుకే దుబాయ్‌కి ఫ్లైట్‌లో వెళ్లి ఐఫోన్ 15 కొని తెచ్చుకున్నా ఆ టికెట్ రేటు క‌లిపినా కూడా అది ఇండియాలో ఐఫోన్ 15 కంటే ధ‌ర త‌క్కువే. దుబాయ్‌లోనే కాదు అమెరికాలోనూ ఐఫోన్ 15 బేసిక్ మోడ‌ల్ ధ‌ర రూ.66,208, చైనాలో రూ. 69,124 ఉంది. అంటే ఇండియాలోనే వీట‌న్నింటికంటే ధ‌ర ఎక్కువ‌. మ‌న ద‌గ్గర త‌యారైన ఫోన్‌కు మ‌న ద‌గ్గ‌రే అధిక ధరేంటో.. ఈ మాయేంటో మ‌రి!

First Published:  16 Sep 2023 9:04 AM GMT
Next Story