Telugu Global
International

ఇజ్రాయెల్ - హమాస్‌ వార్‌.. 3 వేలకు పెరిగిన మృతులు!

హమాస్‌ మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న సరిహద్దు ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలు, వీడియోలు షేర్‌ కావడంతో.. గాజా, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడం బాహ్య ప్రపంచానికి కష్టంగా మారింది.

ఇజ్రాయెల్ - హమాస్‌ వార్‌.. 3 వేలకు పెరిగిన మృతులు!
X

ఇజ్రాయెల్‌ సైన్యం-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు ఐదో రోజుకు చేరింది. ఇప్పటివరకూ 3 వేల మందికి పైగాప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ వైపు 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. పాలస్తీనియన్లు 900 మంది చనిపోయినట్లు సమాచారం. ఇక తమ భూభాగంలో 1400 మంది హమాస్‌ మిలిటెంట్ల డెడ్‌బాడీలు స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

శనివారం ఉదయం హమాస్‌ మిలిటెంట్ల ఆకస్మిక దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్‌.. ఆ సంస్థ స్థావరాలను టార్గెట్ చేసింది. గాజా స్ట్రిప్‌ను పూర్తిగా దిగ్బంధించింది. హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో 2 లక్షల 60 వేల మంది నిర్వాసితులుగా మారినట్లు సమాచారం. లక్షా 75 వేల మంది 88 UN స్కూల్స్‌లో తలదాచుకుంటున్నారు. ఎయిర్‌స్ట్రైక్స్ కంటిన్యూ అవుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాజాను వదిలివెళ్లాలని పాలస్తీనియన్లను హెచ్చరించింది ఇజ్రాయెల్‌. దీంతో వేలాది మంది ఈజిప్టుకు పారిపోతున్నారు. ఇజ్రాయెల్‌ ఫాస్పరస్ బాంబులు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అటు లెబనాన్‌లోని హిజ్బుల్‌ మిలిటెంట్లు, సిరియా సైన్యం సైతం ఇజ్రాయెల్‌ సైన్యంతో పోరాడుతున్నాయి.

హమాస్‌ మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న సరిహద్దు ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలు, వీడియోలు షేర్‌ కావడంతో.. గాజా, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడం బాహ్య ప్రపంచానికి కష్టంగా మారింది.

First Published:  11 Oct 2023 5:19 AM GMT
Next Story