Telugu Global
NEWS

ఎట్టకేలకు దిగొచ్చిన ఒకప్పటి స్టార్ హీరో

ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఒక ప్రత్యేక రోల్‌లో రాజశేఖర్ నటిస్తున్నాడు. సోమవారం నుంచి ఆయన సెట్స్ లో కూడా అడుగుపెట్టాడు.

ఎట్టకేలకు దిగొచ్చిన ఒకప్పటి స్టార్ హీరో
X

90లలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో రాజశేఖర్ ఒకరు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కొత్త మిలీనియంలో రాజశేఖర్‌కు ఏకంగా 20 ఏళ్ల పాటు సక్సెస్ రాలేదు. తోటి సహచర హీరోలైన రాజేంద్రప్రసాద్, సుమన్, నరేష్, శ్రీకాంత్, జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మారి బిజీగా మారినప్పటికీ రాజశేఖర్ మాత్రం హీరో పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చాడు.

మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించేందుకు తాను సిద్ధమని రాజశేఖర్ ప్రకటించగా.. ఆ సమయంలోనే ఆయన హీరోగా నటించిన గరుడవేగ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో 20 ఏళ్ల తర్వాత రాజశేఖర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో తన వద్దకు వచ్చిన ప్రత్యేక పాత్రలను రాజ శేఖర్ తిరస్కరించాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్‌కు వరుసగా ప్లాప్‌లు రావడంతో ఎట్టకేలకు ఈ సీనియర్ హీరో తన మనసు మార్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు అంగీకారం తెలిపాడు.

ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఒక ప్రత్యేక రోల్‌లో రాజశేఖర్ నటిస్తున్నాడు. సోమవారం నుంచి ఆయన సెట్స్ లో కూడా అడుగుపెట్టాడు. ఇకపై వరుసగా కీలక పాత్రల్లో రాజశేఖర్ నటించే అవకాశం ఉంది.

First Published:  17 Oct 2023 6:32 AM GMT
Next Story