Telugu Global
NEWS

చిరంజీవి రికార్డుని అధిగ‌మించిన బాల‌కృష్ణ‌

ఈ సినిమా విడుదలైన చాలా చోట్ల సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

చిరంజీవి రికార్డుని అధిగ‌మించిన బాల‌కృష్ణ‌
X

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వరుస హిట్లు అందుకుంటున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. అఖండ బ్లాక్ బాస్టర్ కాగా, వీరసింహారెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు భగవంత్ కేసరి విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 71 కోట్ల కలెక్షన్లు సాధించి రూ. 100 కోట్ల వ‌సూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ సినిమా విడుదలైన చాలా చోట్ల సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఎక్కువ మాస్ సినిమాల్లో నటించే బాలకృష్ణ సినిమాలకు మొదట్నుంచి ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ, మార్కెట్ లేదు. అయితే ఆయన హీరోగా నటించిన ఆఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద వరుసగా వన్ మిలియన్ మార్క్ కలెక్షన్లు అందుకున్నాయి.

ఇలా ఒక హీరో నటించిన మూడు సినిమాలు వరుసగా వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. బాలకృష్ణ తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు కూడా ఎప్పుడు ఓవర్సీస్ లో వరుసగా మూడుసార్లు వన్ మిలియన్ మార్క్ వసూళ్లు సాధించలేదు. కానీ, బాలకృష్ణ మాత్రం వరుసగా మూడుసార్లు ఓవర్సీస్ లో సత్తా చాటి తనకు ఓవర్సీస్ లో కూడా మార్కెట్ ఉందని నిరూపించుకున్నాడు.

First Published:  23 Oct 2023 7:15 AM GMT
Next Story