Telugu Global
NEWS

మరో విలక్షణ పాత్రలో సాయి పల్లవి.. ఈ సారి సీతగా

రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు నితేష్ తివారీ, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా అగ్ర హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా, మరో అగ్ర హీరో హృతిక్ రోషన్ రావణుడిగా నటిస్తున్నాడు.

మరో విలక్షణ పాత్రలో సాయి పల్లవి.. ఈ సారి సీతగా
X

మలయాళంలో ప్రేమమ్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి సాయి పల్లవి. ఆ సినిమాతో ఆమె సౌత్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సాయి పల్లవి తెలుగులో నటించిన ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, తమిళ్‌లో మారి 2 వంటి సినిమాలు ఆమెను స్టార్‌గా మార్చాయి. ప్రేక్షకుల్లో క్రేజ్ ఎంత ఉన్నా కేవలం తనకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తుందని సాయి పల్లకి పేరు ఉంది. ఎంత పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినా అందులో తన పాత్ర నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా ఆమె రిజెక్ట్ చేస్తుంది. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తుండడం వల్ల ఇప్పటివరకు సాయి పల్లవి చాలా తక్కువ సినిమాల్లో నటించింది.

కాగా గత ఏడాది విరాటపర్వం, గార్గి వంటి విలక్షణ సినిమాల్లో నటించిన సాయి పల్లవి మరో సారి అటువంటి పాత్రలోనే కనిపించనుంది. ఈసారి సాయి పల్లవి సీతగా నటించనుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు నితేష్ తివారీ, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నారు. మధు మంతెన భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా అగ్ర హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా, మరో అగ్ర హీరో హృతిక్ రోషన్ రావణుడిగా నటిస్తున్నాడు.

ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతగా సాయి పల్లవిని మేకర్స్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు దీపిక పదుకొనేను ఎంపిక చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ.. సీత పాత్రలో సాయి పల్లవి అయితే బాగుంటుందని నిర్ణయించుకున్న మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. సీత పాత్రలో నటించేందుకు సాయి పల్లవి కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటివరకు సౌత్‌లో మాత్రమే సినిమాలు చేసిన సాయి పల్లవికి ఇదే మొదటి బాలీవుడ్ సినిమా. సౌందర్య తర్వాత ప్రేక్షకుల్లో అంతటి స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి సీతగా నటిస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  8 Dec 2022 6:55 AM GMT
Next Story