My title My title

నయనతార పెళ్లి చేసుకోనుందా..?

ప్రస్తుతం తమిళనాట ఇదే చర్చ నడుస్తోంది. కోలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న నయనతార త్వరలోనే ఓ బిగ్ షాట్ ను పెళ్లాడబోతోందనే ప్రచారం అక్కడ జోరుగా సాగుతోంది. మరి ఆమెను పెళ్లాడబోయేది ఎవరు? సినిమా హీరోనా లేక బిజినెస్ మేనా.? ప్రస్తుతానికైతే ఈ విషయాలు సస్పెన్స్. ప్రాధమిక సమాచారం ప్రకారం.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోయిన్ కొడుకును నయనతార పెళ్లాడబోతోందని సమాచారం. దీనికి సంబంధించి ఆ సీనియర్ నటి నయనతారతో చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రభుదేవాతో నయన్ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. నిజం చెప్పాలంటే పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత వ్యవహారం చెడింది. పెళ్లికి సంబంధించి నయనతార అప్పట్లో షాపింగ్ కూడా పూర్తిచేసిందని సమాచారం. కానీ తెరవెనక జరిగిన కొన్ని కారణాల వల్ల నయన్-ప్రభుదేవాల వివాహం అగిపోయింది. ఆ తర్వాత ప్రభుదేవా బాలీవుడ్ కు వెళ్లిపోయాడు.. నయన్ కోలీవుడ్ కే ఫిక్స్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు పెళ్లి గురించి ఆలోచన మొదలుపెట్టింది. కుదిరితే ఈ ఏడాది చివరినాటికి పెళ్లి చేసుకొని సెటిలైపోవాలని అనుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − ten =