Telugu Global
Health & Life Style

పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు టిప్స్!

ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా ఆఫీస్‌లో పని చేయడం వల్ల ఇంటికొచ్చాక అలసటతో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల పర్సనల్ లైఫ్ దెబ్బతినడం తో పాటు ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుంది.

పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు టిప్స్!
X

రోజంతా ఆఫీస్‌లో పనిచేసి ఇంటికొచ్చేసరిగి అలసటతో డీలా పడిపోతుంటారు చాలామంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఆఫీస్ టెన్షన్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు అదెలాగంటే..

ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా ఆఫీస్‌లో పని చేయడం వల్ల ఇంటికొచ్చాక అలసటతో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల పర్సనల్ లైఫ్ దెబ్బతినడం తో పాటు ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుంది. అందుకే ఇంటికి రాగానే కొన్ని చిన్నచిన్న పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.

ముందుగా ఆఫీసు నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ పేరుతో జంక్‌ ఫుడ్‌ తినకుండా తాజా పండ్లు, నట్స్‌, సలాడ్స్ వంటివి తీసుకోవాలి. వాటితోపాటు హెర్బల్ టీ, జ్యూస్‌ల వంటివి కూడా తాగొచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరం కాస్త యాక్టివేట్ అయ్యి ఉల్లాసంగా అనిపిస్తుంది. అలాకాకుండా జంక్ ఫుడ్ లేదా టీ, కాఫీలు తాగితే మెదడు మరింత రెస్ట్ కోరుకుంటుంది. కాబట్టి మెదడుని చురుగ్గా ఉంచే ఆహారాలు తీసుకోవాలి.

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా స్నానం చేయడం ముఖ్యం. చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెదడు రీఫ్రెష్ అవుతుంది. స్నానం చేయడం ద్వారా శరీరంలోని కండరాలు రిలాక్స్ అయ్యి నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. తద్వారా యాక్టివ్‌గా అనిపిస్తుంది. అయితే స్నానానికి వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు. దీనివల్ల మగతగా అనిపించే అవకాశం ఉంది.

సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో లైట్ మ్యూజిక్ ప్లే చేయడం, సువాసన వెదజల్లే ఆరోమా స్టిక్స్ లాంటివి వెలిగించడం వల్ల కూడా కొంత లాభం ఉంటుంది. ఒత్తిడి తగ్గి మనసు తేలకపడుతుంది. రోజూ ఇలా చేయడం వల్ల ఇంటికి రాగానే ఆటోమేటిక్‌గా మూడ్ మారిపోయే అవకాశం ఉంటుంది.

ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానానికి ముందు ఇరవై నిముషాలు వ్యాయామం చేయడం ద్వారా కూడా శరీరం యాక్టివేట్ అవుతుంది. వ్యాయామం చేయడం ద్వారా ఎలాంటి ఒత్తిడి అయినా వెంటనే తగ్గుతుంది.

ఇక వీటితో పాటు ఇంటికి రాగానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ద్వారా పని ఆలోచనలు తగ్గి మూడ్ ఛేంజ్ అవుతుంది. పిల్లలు, పెట్స్‌తో గడపడం కూడా మేలు చేస్తుంది.

First Published:  22 Jan 2024 11:04 AM GMT
Next Story