Telugu Global
Health & Life Style

జుట్టు ఆరోగ్యం కోసం కెరాటిన్ జెల్! ఎలా చేయాలంటే..

‘కెరాటిన్’ అనేది జుట్టులో ఉండే ప్రోటీన్. జుట్టులో కెరాటిన్ లెవల్స్ తగ్గడం ద్వారా జుట్టు పలుచబడడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

జుట్టు ఆరోగ్యం కోసం కెరాటిన్ జెల్! ఎలా చేయాలంటే..
X

ఊరికే జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు, జుట్టు పలుచగా, నిర్జీవంగా కనిపించడం.. లాంటివి చాలామందిని కామన్‌గా ఇబ్బంది పెట్టే సమస్యలు. అయితే ఇలాంటి జుట్టు సమస్యలన్నింటికీ ఒకటే చిట్కాతో చెక్ పెట్టొచ్చు. అదే ‘కెరాటిన్ ట్రీట్మెంట్’. దీన్నెలా చేయాలంటే.

కెరాటిన్’ అనేది జుట్టులో ఉండే ప్రోటీన్. జుట్టులో కెరాటిన్ లెవల్స్ తగ్గడం ద్వారా జుట్టు పలుచబడడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే జుట్టు బలంగా ఉండాలంటే దానికి కెరాటిన్ అందించాలి.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జుట్టు పెరగడం కోసం కెరాటిన్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఇది వైద్యుల పర్యవేక్షణలో జరిగే ఆర్టిఫీషియల్ ట్రీట్మెంట్. అయితే ఇప్పుడు మనం ఇంట్లో సహజంగా జుట్టుకి కెరాటిన్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం.

జుట్టుకి కెరాటిన్ ఇవ్వడం కోసం బియ్యం, అవిసె గింజలను సమపాళ్లలో తీసుకుని అందులో నీళ్లు పోసి పావుగంటసేపు మరిగించాలి. నీరు తెల్లగా మారి నురుగు తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమానికి కొద్దిగా కలబంద గుజ్జు కలిపి మెత్తగా ప్యాక్ లాగా చేసుకుంటే కెరాటిన్ జెల్ రెడీ.

ఈ జెల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు చివళ్ల వరకూ అప్లై చేసి గంట తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్‌ వేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుంది.

ఈ మిశ్రమంలోఅమినో యాసిడ్స్‌, విటమిన్–బి, విటమిన్–ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్‌గా చేయడమే కాకుండా జుట్టును మృదువుగా మారుస్తాయి. జుట్టుకి కావాల్సిన కెరాటిన్ ప్రొటీన్‌ను అందేలా చేస్తాయి.

ఇకపోతే గుడ్డు తెల్ల సొనకు కొద్దిగా ఆలివ్ ఆయిల్, వెనిగర్‌ కలిపి.. ఆ మిశ్రమానికి ఆవకాడో గుజ్జు లేదా కలబంద గుజ్జు కలిపి కూడా హెయిర్ ప్యాక్ రెడీ చేయొచ్చు. ఇది కూడా జుట్టుకి కెరాటిన్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది.

First Published:  11 March 2024 1:30 AM GMT
Next Story