Telugu Global
Health & Life Style

కూల్ వాటర్‌‌తో కలిగే నష్టాలివే!

సమ్మర్ వచ్చిందంటే.. వేడి నుంచి రిలీఫ్ పొందేందుకు ఐస్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు చాలామంది. అయితే చల్లగా ఉన్న నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు నిపుణులు.

కూల్ వాటర్‌‌తో కలిగే నష్టాలివే!
X

సమ్మర్ వచ్చిందంటే.. వేడి నుంచి రిలీఫ్ పొందేందుకు ఐస్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు చాలామంది. అయితే చల్లగా ఉన్న నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు నిపుణులు. కూల్ వాటర్ తాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే..

మామూలుగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చల్లటి పదార్థాలైనా, వేడి పదార్థాలైనా తీసుకున్నప్పుడు వాటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం అయినప్పుడే వాటి అరగుదల మొదలవుతుంది. అయితే వేసవిలో శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. ఈ సమయంలో ప్రతీసారీ ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరం వాటిని వేడి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ బలహీన పడుతుంది. అరుగుదల నెమ్మదిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గది ఉష్ణోగ్రత కంటే కొద్దిగా చల్లగా ఉన్న నీటినే మాత్రమే తాగాలన్నది నిపుణుల సూచన. సమ్మర్‌‌లో ఐస్ వాటర్‌‌కు బదులుగా కుండలోని నీళ్లు తాగడం మంచిది.

మిగతా సీజన్లలో కంటే సమ్మర్‌‌లో ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే బాగా చల్లగా ఉన్న ఐస్ వాటర్‌‌ను ఎక్కువగా తాగే వీలుండదు. కొద్దిగా తాగిన వెంటనే గొంతు చల్లగా అనిపించి దాహం తీరినట్టు అనిపిస్తుంది. తద్వారా తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటారు. కాబట్టి ఐస్ వాటర్‌‌కు మామూలు నీళ్లు కలుపుకుని ఓ మోస్తరు చల్లగా ఉన్న నీటిని తాగే ప్రయత్నం చేయాలి.

హాట్ సమ్మర్‌‌లో గడ్డ కట్టిన ఐస్ వాటర్ ను తీసుకోవడం వల్ల తలనొప్పి వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే జ్వరం, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా చల్లని నీటిని అవాయిడ్ చేయాలి.

ఇకపోతే సమ్మర్‌‌లో దాహం తీర్చుకోవడం కోసం కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగుతుంటారు చాలామంది. వీటి వల్ల దాహం తగ్గడం మాట అటుంచితే మరింత దాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే వీటిలో ఉండే హై క్యాలరీల వల్ల బరువు పెరగడం, బీపీ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

First Published:  27 Feb 2024 4:30 AM GMT
Next Story