Telugu Global
Health & Life Style

సూది గుచ్చుకునే బాధ లేదు.. ఇన్సులిన్ ఇక ఈజీ!

మ‌ధుమేహం కంటే ఎక్కువ బాధించేది ఇన్సులిన్ తీసుకోవ‌డం. మాత్ర వేసుకున్న‌ట్లు చ‌టుక్కున వేసుకోలేరు. సూది గుచ్చుకోవాలంటే బాధ‌. ప‌ది మందిలో ఉండ‌గా వేసుకోవాలంటే ఇబ్బంది.

సూది గుచ్చుకునే బాధ లేదు.. ఇన్సులిన్ ఇక ఈజీ!
X

సూది గుచ్చుకునే బాధ లేదు.. ఇన్సులిన్ ఇక ఈజీ!

మధుమేహం జీవిత‌కాల బాధ‌. ఎప్ప‌టిక‌ప్పుడు షుగ‌ర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవాల్సిందే. లేక‌పోతే సైలెంట్ కిల్ల‌ర్‌లా అది అన్ని అవ‌య‌వాల‌నూ దెబ్బ‌తీస్తుంది. అందుకే డ‌యాబెటిక్ పేషంట్లు మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కు ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు. మ‌రికొంత‌మందికి అయితే ఇన్సులిన్ త‌ప్ప‌నిస‌ర‌వుతుంది. కానీ ఇన్సులిన్ తీసుకోవాలంటే సూది గుచ్చుకోకతప్పదు. ఈ బాధకు చెక్ పెడుతూ నోటి ద్వారా తీసుకునే ఓర‌ల్ స్ప్రే రాబోతోంది. మ‌న హైదరాబాద్‌కు చెందిన నీడిల్ టెక్నాలజీస్ సూది అవసరం లేని, ఓరల్ ఇన్సులిన్ స్ప్రే 'ఓజులిన్'ను ' అభివృద్ధి చేసింది.

ద‌శాబ్దాల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

మ‌ధుమేహం కంటే ఎక్కువ బాధించేది ఇన్సులిన్ తీసుకోవ‌డం. మాత్ర వేసుకున్న‌ట్లు చ‌టుక్కున వేసుకోలేరు. సూది గుచ్చుకోవాలంటే బాధ‌. ప‌ది మందిలో ఉండ‌గా వేసుకోవాలంటే ఇబ్బంది. ఈ బాధ‌ల‌న్నింటికీ ప‌రిష్కారం చూపాల‌ని శాస్త్రవేత్త‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో నీడిల్ టెక్నాల‌జీస్ మధుమేహ చికిత్సలో నొప్పిలేని ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్‌కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించినట్లు నీడిల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, ట్రాన్సన్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కె. కోటేశ్వర రావు తెలిపారు.

భ‌ద్ర‌తా ప‌రీక్ష‌లు, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ఓకే అయితే

ఇప్పుడు ఓజులిన్‌పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు కంపెనీ దరఖాస్తు చేసింది. మనుషులపై క్లినికల్ పరీక్షలను నిర్వహించడానికి ముందు భ‌ద్ర‌తా ప‌రీక్ష‌లు తప్పనిసరి. ఇవ‌న్నీ పాస‌యితే డ‌యాబెటిక్ పేషంట్లు త‌మ ఇన్సులిన్ సూదుల‌ను సంతోషంగా విసిరిగొట్టొచ్చు మ‌రి!

First Published:  3 Nov 2023 5:30 AM GMT
Next Story