Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో జుట్టు రాలడం తగ్గాలంటే

సమ్మర్‌‌లో కామన్‌గా వచ్చే ఇబ్బందుల్లో పొడిజుట్టు కూడా ఒకటి. వేసవిలో పొడిగాలి కారణంగా జుట్టు కుదుళ్లలో తేమ ఎండిపోతుంది. తద్వారా జుట్టు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

సమ్మర్‌‌లో జుట్టు రాలడం తగ్గాలంటే
X

సమ్మర్‌‌లో కామన్‌గా వచ్చే ఇబ్బందుల్లో పొడిజుట్టు కూడా ఒకటి. వేసవిలో పొడిగాలి కారణంగా జుట్టు కుదుళ్లలో తేమ ఎండిపోతుంది. తద్వారా జుట్టు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. మరి దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ముందుగా జుట్టు హెల్దీగా ఉండడానికి సరైన పోషకాహారం తీసుకోవడం అవసరం. ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తోపాటు నీటిశాతం కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తీసుకుంటుండాలి.

సమ్మర్‌లో జుట్టు రాలే సమస్యను తగ్గించాలంటే తరచూ జుట్టుకి నూనె అప్లై చేస్తుండాలి. జుట్టుకి నూనె రాయడం వల్ల కుదుళ్లకు తేమ లభిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలంగా ఉంచుతుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్, ఉసిరి, ఆలివ్ నూనెలను ఉపయోగించొచ్చు.



ఇక సమ్మర్‌‌లో జుట్టు సేఫ్‌గా ఉండాలంటే ఎండకు జుట్టు ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. హ్యాట్ వాడడం లేదా నీడ పట్టున ఉండడం ద్వారా జుట్టు ఎండిపోకుండా ఉంటుంది. అయితే సమ్మర్‌‌లో బిగుతైన హెల్మెట్‌లు, టోపీలు వాడడం వల్ల కూడా జుట్టులో చెమట పట్టి చుండ్రు వస్తుంది. కాబట్టి వదులైన వాటిని వాడాలి.

సమ్మర్‌‌లో జుట్టు ఆరోగ్యం కోసం వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయడం ముఖ్యం. దీనివల్ల మాడుపై పేరుకున్న దుమ్ము ధూళి వంటిటి నశిస్తాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది.



ఇక వీటితోపాటు సమ్మర్‌‌లో హెయిర్ ప్యాక్‌ల ద్వారా కూడా జట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. మెంతిగింజల పేస్ట్‌ను జుట్టుకి అప్లై చేసుకోవడం లేదా చల్లార్చిన గ్రీన్‌ టీతో జుట్టుకి మసాజ్ చేసుకోవడం వంటి చిట్కాలు కూడా పనిచేస్తాయి.

First Published:  29 March 2024 1:33 PM GMT
Next Story